బట్టబయలు అయిన బాబు బాగోతం… బీసీల సాక్షిగా…

వైయస్సార్సీపి అధినేత జగన్ చంద్రబాబు అవినీతి పాలనను, అరాచకాన్ని ప్రజా సంకల్ప యాత్ర లో బయట పెట్టారు జగన్.

సమర శంఖారావం పేరిట బాబు నాలుకల్లో మడతల్ని, టిడిపి చేపట్టిన దుష్టపాలనను వ్యాఖ్యానించారు.

ఇప్పుడు జగన్ బాబు లోని మరో కోణాన్ని కుడా బయట పెట్టారు.. కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు జగన్.

గత పాలనలో బీసీలకు ఈ ఒక్క పని కూడా చేపట్టలేదని జగన్ సాక్షుల ద్వారా నిరూపించారు.

“కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది.”ఇంటర్మీడియట్ విద్యార్థులు చేతుల లో ఐ ప్యాడ్స్ కనిపించడం లేదు… ఇక ప్రతి సంవత్సరానికి బిసి సబ్ ప్లాన్ కింద 10 వేల కోట్లు అని చెప్పారు.

ప్లాన్ అమలు చట్టం చేస్తారంటూ పేర్కొన్నారు. ఎన్నికలు నెల రోజుల ముందే బాబుకి చట్టాలు గుర్తొస్తాయి మరి.

గత ఐదేళ్లలో ఎప్పుడు గుర్తుకు రాలేదు…

ఏలూరులో చేపట్టిన బీసీ గర్జన సభలో బాబు నిజస్వరూపాన్ని బయటపెట్టారు జగన్. బీసీలను కేవలం ఓట్ల కు మాత్రమే పరిమితం చేస్తున్నారు బాబు, వాళ్లకి ఇచ్చిన హామీని కావాలని మరిచిపోయారని, చివరికి తన చేతిలోనే ఉన్న సబ్ ప్లాన్ ను కూడా చేపట్టలేక ఉన్నారని జగన్ ఆరోపించారు.

బాబు హామీలన్నీ ఒక్కొక్కటిగా జగన్ వివరిస్తుంటే, ప్రజలంతా దానికి మద్దతుగా చేతులను పైకెత్తి అడ్డంగా ఊపారు.

రాష్ట్ర ప్రణాళికా వ్యయం తో 25 శాతం నిధులను బిసి ఉప ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రణాళిక వ్యయంలో 25 శాతం నిధులను బీసీ సబ్ ప్లాన్ కోసం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా అన్నారు బాబు.

ఇక్కడ రాష్ట్రంలో సబ్ ప్లాన్ కి దిక్కులేదు, 25 శాతం కి దిక్కులేదు, అటు రాష్ట్రానికి కూడా దిక్కు లేదు… కానీ కేంద్రంలో మటుకు చక్రం తిపుతారట.

కేంద్రంలో ఉన్న బిజెపితో నాలుగున్నరేళ్లు కలిసి మెలిసి ఉన్నప్పుడు ఏ ఒక్క సారి కూడా బీసీ సంక్షేమం అనే అంశాలు బాబుకు గుర్తు రాలేదు.

బీజేపీతో విడిపోయిన తర్వాత బాబుకి బీసీల కం అన్యాయం జరిగినట్టు వాపోయారు.

ఇకనైనా ప్రజలు మేల్కొని బాబు నాటకాలన్నీ బీసీలు తోపాటు అందరూ గమనించాలని కోరుకున్నారు.

రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవు. ఈ నాలుగున్నర ఏళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీతో ఈ కులాల గురించి కేంద్రానికి ఒక్క లేఖ కూడా బాబు రాయలేదు.

బీసీ లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో బాబు మాట ఇచ్చి ఇప్పుడు తప్పారు. కేవలం ఓట్ల కోసమే బాబు ఈ నాటకాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటన చేశారు వైయస్ జగన్. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ను ప్రవేశపెట్టారు జగన్.

పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు.

బీసీ కమిషన్ కు చట్టబద్దత కలిగించడంతో పాటు బీసీ కులాల్లో ఉన్న డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తన డిక్లరేషన్ లో భాగంగా కులాల వారిగా ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు నీ ప్రకటించారు జగన్… కేవలం ఓట్ల కోసం ఇది అంత చెప్పడం లేదని ఒక్కసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తామని ఆయన అన్నారు.

అన్ని హామీలను నెరవేర్చే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు అడుగుతానని స్పష్టం చేశారు. మరి ఇకనైనా ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో వేచి చూడాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *