తెలుగులో అజిత్ ‘విశ్వాసం’.. విడుదల తేదీ ఖరారు

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’. త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై వస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తమిళంలో తెరకెక్కిన ఆయన సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి.

2015లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరింధాల్’ సినిమా ‘ఎంతవాడు గాని..’ పేరిట తెలుగులోకి అనువాదమైంది. ఆ తరవాత వచ్చిన ఆయన రెండు సినిమాలు అనువాదం కాలేదు.

సుమారు మూడేళ్ల తరవాత ఇప్పుడు అజిత్ మరో చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్షన్ డ్రామా ‘విశ్వాసం’.

త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్కడ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని స‌త్యజ్యోతి ఫిలింస్ అసోషియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వర‌రావు తెలుగు ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు.

ఇందులో టాలీవుడ్‌కి చెందిన విల‌క్షణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో న‌టించారు. అనువాద కార్యక్రమాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు మీడియాకు తెలియజేశారు.

మార్చి 1న వస్తోన్న ‘విశ్వాసం’

ఈ సందర్భంగా ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వర‌రావు మాట్లాడుతూ.. ‘అజిత్, శివ కాంబినేష‌న్‌లో మూడు వ‌రుస బ్లాక్ బ‌స్టర్ చిత్రాలు వచ్చాయి.

వీరి క‌ల‌యిక‌లో వచ్చిన నాలుగో బ్లాక్ బస్టర్ ‘విశ్వాసం’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

ఎందరో నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం పోటీ ప‌డ్డారు. ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను.

అవ‌కాశం ఇచ్చిన స‌త్యజ్యోతి ఫిలింస్ వారికి నా ధన్యవాదాలు. స‌త్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేష‌న్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుద‌ల చేయ‌బోతున్నాం.

త‌మిళంలో బ్లాక్ బ‌స్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అవుతుంది’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *