చింతమనేని వివాదం.. వైసీపీ పనేనంటున్న ..సీఎం చంద్రబాబు ఆరోపించారు

దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది.

దళితులపై ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ వాళ్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

దళితులను కించపరిచేలా మాట్లాడారంటూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చెలరేగిన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

చింతమనేని వీడియోను వైసీపీ వాళ్లే ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.

చింతమనేని వీడియో క్లిప్పింగులను పరిశీలించిన టీడీపీ అధిష్ఠానం వాటిని ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పెట్టినట్లు ధ్రువీకరించింది. ఇది ముమ్మాటికీ వైసీపీ కార్యకర్తల పనేనని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి తాలూకు రాయలసీమ రౌడీ లను బూచిగా చూపించి ఈ రౌడీ ఎమ్మెల్యే ను తెదేపా సమర్ధించడం,పాముకు పాలు పోయడమే.కానీ చింతమనేని కంటే రాయలసీమ రౌడీలే నయమనిపించాడు.మంత్రిపదవి ఇవ్వలే…

గత నెల మొదటివారంలో దెందులూరు మండలం శ్రీరామవరంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో ఓ దళిత యువకుడు మైకు ఇవ్వాల్సిందిగా కోరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా దళితులను అవమానించేలా చింతమనేని వ్యాఖ్యానించారంటూ ఓ వీడియా సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైసీపీ, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లావ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

మరోవైపు తనకు వ్యతిరేకంగా జరుగుతున్న అసత్య ప్రచారంపై చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇతర పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

తాను దళితులను అవమానించినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సజీవ దహనం చేసుకుంటానన్నారు. తనను దళిత వ్యతిరేకినని ముద్ర వేసినంత మాత్రాన ప్రజల నుంచి వేరుచేయలేరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *