కాపులకు 5 శాతం బిల్లు శాసనసభలో ప్రవేశం

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాలలో కాపు ఉప కులాలైన బలిజ ఒంటరి కి 5 శాతం .

ఇతర ఆర్థికంగా వెనకబడిన పేదలకు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును బుధవారం శాసన ప్రవేశపెట్టారు.

ఆర్థికంగా వెనకబడిన వర్గాల కో 10 శాతం రిజర్వేషన్ కలిపిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో.

గత నెల 27న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కాపులకు 5 శాతం, అగ్రకులాల్లో పేదలకు మరో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రూపొందించిన బిల్లును వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శాసన సభ ముందుంచారు.

విద్యాసంస్థల్లో సీట్లు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా బిల్లును ప్రభుత్వం రూపొందించింది.

కాపు ఉప కులాలకు 1, అగ్రకులాల్లో పేదల కోసం మరొకటి చొప్పున రెండు బిల్లులను మంత్రి ప్రవేశపెట్టారు.

శాసన సభలో వివిధ అంశాలకు సంబంధించి 5 బిల్లులతో పాటు పలు పత్రాలను పలువురు మంత్రులు సభ ముందుంచారు.

చిత్తూరు జిల్లాల్లో veltech విశ్వవిద్యాలయం, అనంతపురం జిల్లాల్లో భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ ,సాంకేతిక , విజ్ఞాన ,వినూతన కల్పనా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సభలో ప్రవేశపెట్టారు.

రాష్ట్రంలో ప్రపంచస్థాయి డిజిటల్ విద్యాబోధన కేంద్రం ఏర్పాటుకు మరో బిల్లును కూడా మంత్రి సభ ముందుంచారు.

వెనుకబడిన తరగతుల ఉపప్రణాళిక బీసీ సబ్ ప్లాన్ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.

రాష్ట్ర విత్తనాభివృద్ధి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సహాయ సంస్థ వార్షిక నివేదికలను సభ ముందుంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *