“యాత్ర” రివ్యూ

మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి జీవించారు.
“మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డ తో రాజకీయం ఏందిరా? “ ఎస్టాబ్లిషెస్
వైఎస్సార్ క్యారెక్టర్ మాటంటే మాటే..
నిలువెత్తు నిబద్ధతే….
‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ…

జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు ఎలా సంపాదించుకున్నారు అని చెప్పటంలో…..‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి.. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం…. పాదయాత్ర మీద సినిమా అనే ఒక కష్టతరమైన సబ్జెక్టుని హృదయాన్ని కదిలిస్తూ హృద్యంగా చెప్పటంలో దర్శకుడు మహి విజయం సాధించినట్లే అని చెప్పుకోవాలి.
కంగ్రాట్స్ టు ద యాత్ర టీం!
సినిమాలో పెద్దగా విమర్శల జోలికి వెళ్లకుండా ప్రజాసమస్యల మీద దృష్టి పెట్టి తీశారు.