విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి సన్నాహాలు

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి
ఆలయ అభివృద్ధి పనులను త్వరలోనే
ప్రారంభం చేసెదమని ఆలయ కార్యనిర్వహణ అధికారి మాధవి తెలిపారు, మార్గశిర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి అని విజయవంతం చేసిన భక్తులకు అధికారులకు కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు,అందరి సహకారంతో అత్యంత వైభవంగా మార్గశిర మాసోత్సవాలు జరిగాయి, ఈ ఏడాది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చార, హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు, ఈ ఏడాది అమ్మవారి ఆలయ విస్తీర్ణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు,
ఆలయ అభివృద్ధి కోసం కొత్తగా 10 భవనాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు , తిరుమల తిరుపతి దేవస్థానం వారు పదికోట్ల రూపాయలు
ఇచ్చుటకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు, శిధిలావస్థలో ఉన్న పలు భవనాలను, పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు, రహదారి విస్తరణ పనులను, ప్రారంభించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియ అంతా కూడా త్వరలోనే పూర్తి పూర్తి కాగలదు అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *