టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఘాటు లేఖ రాశారు…

‘గాంధీ జయంతి సాక్షిగా.. ఈ ప్రశ్నలకు బదులివ్వు చంద్రబాబూ’

చంద్రబాబుకు ఘాటు లేఖ రాసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు. గాంధీ జయంతి సాక్షిగా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ లేఖాస్త్రాన్ని సంధించారు.

బాపూజీ స్ఫూర్తితో.. మహాత్ముడి 150వ జయంతోత్సవాల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిసంకల్పంతో ప్రారంభమైన గ్రామ సచివాలయాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి వైఖరి ఏంటి.

బాబు పాలనకు.. జగన్‌ పాలనకు మధ్య తేడాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌, శ్రీదేవి, సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణలు ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు.

ఎమ్మెల్యేలు రాసిన లేఖ, అందులో ప్రస్తావించిన అంశాలు, ప్రశ్నలు

1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ ప్రారంభిస్తున్నందుకు టీడీపీ సంతోషించకపోగా.. బాధపడుతోందా..?

2) గడిచిన మీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు జన్మభూమి కమిటీ వ్యవస్ధ ద్వారా మీరు చేసిన అరాచకాలు-దోపిడీలను కప్పిపుచ్చుకునేందుకే చివరికి గ్రామ వాలంటీర్ల వ్యవస్ధను కూడా విమర్శిస్తున్నారా..?

3) గ్రామ సచివాలయాలపై మీ స్టాండ్ ఏంటి చంద్రబాబు గారూ.. ?

4) 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు, ప్రతీ 2వేల జనాభాకు 10 మందిని కేటాయించినందుకు మీరు సంతోషపడుతున్నారా లేక బాధపడుతున్నారా?

5) గ్రామ వాలంటీర్ల ఎంపిక కూడా అత్యంత నిష్పాక్షికంగా జరిగిందని ఏ గ్రామంలో అడిగినా చెప్తారు. 1.34 లక్షల మందికి ఒకే రోజున ఉద్యోగాలివ్వడం దేశచరిత్రలో ఎప్పుడైనా చూశారా? మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కల అయినా కన్నారా..?

6) మీరు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మీ జీవితంలో ఎప్పుడైనా 10వేల మందికి ఉద్యోగాలిచ్చారా.. ? కనీసం 1000 మందికైనా ఇచ్చారా..?

7) మీరు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల లోపు ఎప్పుడైనా ఉద్యోగాలు రిక్రూట్ చేశారా?

8) గ్రామాల్లోనే ఇళ్లపట్టాలిచ్చే వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?

9) గ్రామాల్లోనే ఎరువులు, పురుగుమందులు.. అవీ ప్రభుత్వం ధృవీకరించినవి అమ్మే ఏర్పాటు ఎప్పుడైనా చూశారా?

10) గ్రామాల్లోనే మహిళా పోలీస్ వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?

11) గ్రామసచివాలయం ద్వారా దాదాపు 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 పనులు అక్కడికక్కడే ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. మీ 14 యేళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా ?

12) మన మండలంలోనే మనకు ఉద్యోగాలొస్తున్నాయంటే.. మళ్ళీ గ్రామాలు బ్రతుకుతాయి.. అక్కడి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇటువంటి ఆలోచన మీరు ఎప్పుడైనా చేశారా ?

13) 2004 కు ముందు 9 యేళ్లు పరిపాలించి.. గ్రామాలన్నీఖాళీ అవడానికి కారణం మీరు కాదా ?

14) గ్రామాల్లో ఎక్కువ కరెంటు కోతలు, ఉచిత విద్యుత్ ఎట్టి పరిస్ధితుల్లో ఇచ్చేది లేదన్నమీ స్టేట్ మెంట్, కరెంటు బకాయిలున్న రైతులపై కేసులు పెట్టి ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన చరిత్ర మీది కాదా..?

15) 2014-18 మధ్య రుణమాఫీ చేయకుండా వ్యవసాయాన్ని చావుదెబ్బ కొట్టారు. బంగారాన్ని విడిపించలేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వ లేదు. భీమా ఇవ్వలేదు. ధరలస్ధిరీకరణ లేదు. ప్రకృతి విపత్తు నిధీ లేదు. చివరకు అధికారంలోకి రాగానే పించన్లు, రేషన్కార్డులను పార్టీల వారీగా విభజించి 10 లక్షల చొప్పున తొలగించింది మీరు కాదా..?

16) జన్మభూమి కమిటీలని పెట్టి రేషన్ కార్డు కావాలంటే లంచం, ఫించన్ కావాలంటే లంచం.. ఇళ్ల పట్టాలకు, మరుగుదొడ్లకు, భీమాకు కూడా లంచాలు వసూలు చేసిన ఘన చరిత్ర మీది కాదా..?

17) చివరకి ఇసుక, మట్టి కూడా అమ్ముకున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి మేం చంద్రబాబు గారిని నేరుగా ఈ ప్రశ్న అడుగుతున్నాం. మీ జన్మభూమి కమిటీలు బాగున్నాయా ? మా గ్రామ సచివాలయాలు బాగున్నాయా ? సూటిగా సమాధానం చెప్పండి.

18) మీ జన్మభూమి కమిటీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? మా గ్రామ సచివాలయాల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది, ఈ రెండూ అసలు పోల్చతగినవేనా.. ? ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే పల్లె ప్రజలకు, పల్లెల్లోనే వారి గుమ్మం వద్దే అన్ని కార్యక్రమాలు అందుతుంటే ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి … మీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టుని మహానాయకుడిగా చూపించడం మీకు సిగ్గుచేటు కాదా ?

19) ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి గారిపై మీరు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఓ దొంగ కేసు విషయంలో సిబిఐ ఓ కౌంటర్ వేసిందంటూ మీరు, మీ మీడియా ఆనందపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు పరిపాలన మీద ఫోకస్ చేస్తుంటే.. మీకందుకు అంత భయం చంద్రబాబు గారూ.. ?

20) గత నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనినైనా మీరు మెచ్చుకున్నారా ? కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు ఇస్తుంటే ఆ బిల్లులకైనా మీరు మద్ధతిచ్చారా ?

21) నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు ఇస్తూ .. దేశంలోనే మొదటిసారిగా ఒక చట్టం మన అసెంబ్లీలో పాస్ అవుతుంటే దానికైనా మీరు మద్ధతిచ్చారా.. ?

22) నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడే శక్తి లేక మీ రాజ్యసభ సభ్యులు మొదలు.. మామూలు నాయకుల వరకు సగం మందిని వ్యూహాత్మకంగా బిజేపిలోకి పంపించి, దీన్నే గొప్ప రాజకీయంగా మీరు భావిస్తున్నది మీరు కాదా..?

అంతేకాక, గత నాలుగునెలలుగా చంద్రబాబు ఎవరికి మద్ధతిచ్చారన్నది గమనిస్తే..

 1. మీరు అక్రమంగా నివాసముంటున్న ఇల్లు కట్టిన లింగమనేనికి మద్ధతిచ్చారు
 2. మీరు ఏటీఎంగా మార్చుకున్న పోలవరం కాంట్రాక్టరుకు సంపూర్ణ మద్ధతిచ్చారు.
 3. మీ పార్టీలో ఉంటూ మీ వల్ల చనిపోయిన ఫ్యాక్షనిస్ట్‌కు మద్ధతిచ్చారు.
 4. మీరు లంచాలు గుంజి చేసుకున్న పీపీఏల విషయంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రైవేటు పవర్ ప్రొడ్యూసర్లకు మద్దతిచ్చారు.

ఇవన్నీ గమనించిన తర్వాత మీ నాలుగు నెలల ప్రతిపక్ష రాజకీయం ఎలా ఉందంటే..

 1. ఎస్సీల బిల్లుకు మద్దతు లేదు
 2. ఎస్టీల బిల్లుకు మద్దతు లేదు
 3. బీసీల బిల్లుకు మద్దతు లేదు
 4. మైనార్టీల బిల్లుకు మద్దతు లేదు
 5. మహిళల బిల్లుకు మద్దతు లేదు
 6. గ్రామ సచివాలయాలకు మద్దతు లేదు
 7. జ్యుడీషియల్ ప్రివ్యూ బిల్లుకు మద్దతులేదు
 8. ప్రజా ధనాన్ని మిగిల్చే రివర్స్ టెండరింగ్ కి మద్దతు లేదు
 9. ఆశా కార్యకర్తల జీతాలు పెంపుదలకు మద్దతు లేదు
 10. పోలీసులుకు వారాంతపు సెలవుకు మద్దతు లేదు
 11. ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తుంటే మద్దతు లేదు
 12. స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతులేదు.. ఆసుపత్రులు బాగు చేసినా మద్దతు లేదు.
 13. జలాశయాలన్నీ నిండుకుండల్లా నిండినా…. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురిసినా మీకు సంతోషం లేదు.
 14. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినా మీకు సంతోషం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *