జనసేన పార్టీకి మరో షాక్ తగలనుందనే వార్త ప్రచారంలో ఉంది…

జనసేనకు షాకివ్వనున్న కాపు నేత.. జగన్ పార్టీలోకి!

జనసేన పార్టీకి మరో షాక్ తగలనుందనే వార్త ప్రచారంలో ఉంది. ఆకుల సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలో చేరతారని సమాచారం. గత ఎన్నికల ముందే ఆయన బీజేపీని వీడి జనసేనలో చేరారు.

2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల సత్యనారాయణ 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. పవన్ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసిన ఆయన ఓడారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే వార్తలొస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. దసరా వేళ ఆయన అధికార పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

గతంలో రావెల కిశోర్ బాబు జనసేనను వీడినప్పుడే.. ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ మారతారనే వార్తలొచ్చాయి.

నర్సీపట్నం MLA జనసేన పార్టీ అభ్యర్థి గా వేగి దివాకర్ కు.. నామినేషన్లు గడువు ఒకరోజు ఉంది అనగా హడావుడిగా టికెట్ కెటయించారు…. అయినప్పటికీ పార్టీ అధిష్టానం ప్రకారం నర్సీపట్నం MLA అభ్యర్థి గా నామినేషన్ వేసినప్పటికి..

చివరి నిమిషంలో నామినేషన్ తిరస్కరణకు గురైంది.. అయినప్పటికి పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమించి.. తన అనుచరులు సూచన మేరకు..

ఎలక్షన్ అనంతరం జనసేన పార్టీకి రాజీనామా చేసారు.. ఈ రోజు ఉదయం పెందుర్తి శాసన సభ్యులు అదిప్ రాజు గారి ఆధ్వర్యంలో వేగి దివాకర్, వారి అనుచరులు గౌరవ మంత్రివర్యులైన శ్రీ అవంతి శ్రీనివాసరావు గారితో వై కా పా కండువా కప్పుకుని వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

కానీ ఆయన మాత్రం సైలెంట్ అయ్యారు. వైఎస్ హయాంలో కాపు నేతలు కాంగ్రెస్ పార్టీకి బలంగా మద్దతునిచ్చారు.

రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది టీడీపీ వైపు మొగ్గారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది.

మళ్లీ కాపు నేతలను తమ వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు.

ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను, కాపు నాయకులను తమ వైపు తిప్పుకుంటే పార్టీ మరింత బలపడుతుందనేది జగన్ యోచనగా ఉంది.

మరోవైపు జనసేన పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేసిన తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు.

రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితర నేతలు జనసేన పార్టీని వీడారు.

ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ మారారు. వలసలు జనసేన పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *