వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేస్తారన్న వార్తలు..

రాజ్‌నాథ్ సింగ్‌తో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ
ఢిల్లీ పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ పలువురు బీజేపీ పెద్దలతో భేటీలు నిర్వహిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన విషయం తెలిసిందే.
బీజేపీ నేతలతో చర్చలు జరుపుతూ గతంలోనూ ఆయన చాలా సార్లు వార్తల్లోకెక్కారు. రాజ్‌నాథ్‌తో ఆయన వైసీపీ అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసుపై చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శరద్‌యాదవ్ తరహాలో రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్ వేటు వేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
పార్లమెంట్‌లో కూడా నిర్ణయం తీసుకునేలా చర్యలు ఉంటాయని వైసీపీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ.. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని, దానిపై ఏపీ సీఎం జగన్ సంతకం లేదని రఘురామ కృష్ణం రాజు అంటున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసంపై ఉన్నట్లు ఆయన నిన్న ఈసీ దృష్టికి కూడా తీసుకెల్లారు.
తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని, తనపై చర్యలు ఎలా తీసుకుంటారాని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కూడా కలుస్తుండడం ఆసక్తి రేపుతోంది.
గత కొన్ని రోజులుగా రఘురామ వ్యవవహారం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆయనకు సొంత పార్టీ తరపున షోకాజు నోటీస్ రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజు నోటీసుల్లో పేర్కొన్నారు.