క్రీడలకు కేంద్రంగా విశాఖ, బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ క్రీడాభివృద్ధే ధ్యేయం: కలెక్టర్ ప్రవీణ్కుమార్

అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన విశాఖ నగరంలో క్రీడలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 24 తేదీ నుంచి నగరం లో జరగబోయే బాడీ బిల్డింగ్ పోటీలకు చెందిన ట్రోఫీని శనివారం వండా బాలలప్రాంగణం వద్ద ఆవిష్కరించి బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలను నిర్వహిస్తున్న నగరానికి చెందిన ఇండియన్ జిమ్ క్లాసిక్స్ అధినేత బి రాజేష్ ను అభినందించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం ఎల్లప్పుడూ వుంటుందన్నారు. నిర్వాహకుడు రాజేష్ మాట్లాడుతూ ఈపోటీలను గత మూడుసంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13జిల్లాల నుంచి రానున్న క్రీడాకారులందరికీ ఫుడ్, ట్రావెలింగ్ , అకామిడేషన్ తదితరచ కనీసవసతులన్నీ తామే కల్విస్తున్నామన్నారు. ఎనిమిది కేటగిరీల్లో అక్కయ్యపాలం 80ఫీట్ రోడ్డులో పోటీలు నిర్వహంచనున్నట్లు తెలిపారు. గెలుపొందిన విజేతలకు ట్రోఫీ, సర్టిఫికెట్ తో పాటు రెండున్నర లక్షలు క్యాష్ ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్డీపీ చైర్పర్సన్ లాలం భవాని, వీజెఎఫ్ అధ్యక్షుడు గంటా శ్రీనిబాబు రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి కె. గురునాదరావు, నిర్వాహకురాలు రమ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *