రానున్న ఎన్నికల కోసం సంక్రాంతి సంబరాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్న చంద్రబాబు నాయుడు

పండగొచ్చినా పబ్బమొచ్చినా చంద్రబాబుకు గొప్ప సరదా అంటే నమ్మండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒకటే పండుగల హోరు, సంప్రదాయంగా వస్తున్న పండుగలతో పాటు మొక్కల కోసం ఒకసారి నీరు కోసం మరోసారి ఇలా ప్రతిసారి ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ల ఖర్చు చేస్తు , అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే, అత్త సొమ్ము అల్లుడు దారపోసి రూ అంటే ఇదేనేమో, ప్రజాధనాన్ని పండుగల పేరిట సాక్షాత్తు సర్కార్ ఏర్పాటుకు కార్యక్రమాలను చేపట్టి లక్షలాది రూపాయలు వెదజల్లడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది, మన దసరా ది వాలిని విశాఖ బీచ్ లో కోట్లాది రూపాయలతో భారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే, ఇక ఆ తర్వాత ఇటు వల్లే విశాఖ ఉత్సవ పేరిట దాదాపు 350 కోట్ల పైచిలుకు ప్రభుత్వం ధన వ్యయం చేశారు, మళ్లీ రోజుల వ్యవధిలో సంక్రాంతి పండుగ రావడంతో ప్రభుత్వం ఈ అవకాశాన్ని మాత్రం ఎందుకు వదులుకోవాలని భావించిందో ఏమో కానీ సంక్రాంతి నిర్వహణకు కూడా సై అంటోంది, శనివారం విశాఖ జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికారికంగా నిర్వహించేందుకు వీలుగా దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వ ఖజానా విడుదలయింది, మండలానికి లక్ష చొప్పున విడుదల చేశారు, మహా విశాఖ నగరపాలక సంస్థ లోని ఒక్కొక్క జోన్ కార్యాలయానికి లక్ష చొప్పున కేటాయించారు, మధురవాడ లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం శిల్పారామం కార్యక్రమం నిర్వహణకు మూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు, అదేవిధంగా చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో శనివారం నుండి సంక్రాంతి వేడుకలు ఆరంభమయ్యాయి ఇక్కడ కూడా లక్షలాది రూపాయలు విడుదల చేశారు….

ఆయా నిధులతో మన సాంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు, అలాగే సంక్రాంతి కొట్టు వచ్చేలా గ్రామీణ సంప్రదాయం నడిచి వచ్చేలా నిర్వహించాలని ఆదేశించింది, ఈ సందర్భంగా పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు, ఈ సంక్రాంతి సంబరాల్లో తెలుగు తమ్ముళ్లు అధికారులు హడావిడి తప్ప జనం భాగస్వామి లేదనే చెప్పాలి, సంక్రాంతి వేళ లో ఎవరు ఇళ్లల్లో వారు తమ బంధువులు మిత్రులతో ఏటా సాంప్రదాయంగా జరుపుకున్న సందర్భంలో ప్రభుత్వము వారు వారి ప్రచారం కోసం చేపడుతున్న అట్టహాస కార్యక్రమాలకి ఎవరు వస్తారు అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి, ప్రతి అవకాశాన్ని ముఖ్యమంత్రివర్యులు రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు, ప్రజాధనంతో పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు అని వాదనలు వినిపిస్తున్నాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *