వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే
మిరాజ్-2000 చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్‌తో.. శత్రువుల్ని ఆటోమెటిక్‌గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. మిరాజ్-2000లో సింగిల్ సీటర్, టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి.

గంటకు 2795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది
నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు
1999లో కార్గిల్ యుద్ధంలోనూ కీలకపాత్ర

పుల్వామా దాడికి భారత్ పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. వైమానిక దళం యుద్ధ విమానాలతో ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టింది.

ఈ దాడిలో మిరాజ్-2000 విమానాలు శత్రు సంహారంలో కీలకపాత్ర పోషించాయి. టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.

దీంతో శత్రువుల పాలిట సింహ స్వప్నమైన మిరాజ్-2000 యుద్ధ విమానంపై అందరి దృష్టిపడింది. ఈ యుద్ధ విమానంపై చర్చ మొదలయ్యింది.

మిరాజ్-2000 విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే.. డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన ఈ యుద్ధ విమానం రంగంలోకి దిగితే శత్రు స్థావారాలు ధ్వంసం కావాల్సిందే. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో దిట్ట.

గంటకు 2795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు.

మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ (WDNS) ఉంటుంది. ఈ విమానం చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్‌తో.. శత్రువుల్ని ఆటోమెటిక్‌గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. మిరాజ్-2000లో సింగిల్ సీటర్, టూ సీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి.

ఈ విమానంలో తొమ్మిది చోట్ల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. ఎయిర్ టు ఎయిర్ (ఆకాశం నుంచి ఆకాశంలోకి) బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్-2000 సొంతం.

ఇక మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను మిరాజ్ మోసుకెళ్లగలదు. MBDA BGL 1000 లేజర్ గైడెడ్ బాంబ్, MBDA AS30L, MBDA ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, MBDA AM39 Exocet యాంటీ షిప్ మిసైల్, MBDA రాకెట్ లాంఛర్లు, MBDA Apache స్టాండ్ ఆఫ్ వెపన్స్‌ని మోసుకెళ్తుంది.

ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ 1970లో మిరాజ్-2000 తయారీ మొదలైతే.. 1984 నుంచి ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందిస్తోంది. 1985లో భారత వాయుసేనలో చేరగా.. వజ్రగా నామకరణం చేశారు.

1999లో కార్గిల్ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించడంలో మిరాజ్ 2000 విమానాలు కీలకపాత్ర పోషించాయి.

ఆ తర్వాత భారత ప్రభుత్వం మిరాజ్ విమానాలను కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలే ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపాయి.

మిరాజ్‌-2000 యుద్ధ విమానాల్లో రకాలు
Mirage 2000C, Mirage 2000B, Mirage 2000N, Mirage 2000D, Mirage 2000E, Mirage 2000-5EI, Mirage 2000-5EDA, Mirage 2000EAD/RAD, Mirage 2000EG, Mirage 2000-5F, Mirage 2000-5 Mark 2,Mirage 2000M, Mirage 2000H, 2000I, Mirage 2000P, Mirage 2000BR, Mirage 2000-9. మన దగ్గర 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *