రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు అంటున్న రోజా

సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ పేరుతో, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు.
మహిళా తాళిబొట్లను తెంచేవిధంగా నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారు. మహిళా ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సోమవారం మీడియాతో రోజా మాట్లాడుతూ, డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలఆత్మహత్యలు ఉండేవి కావని అన్నారు.

పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఔటే డేటెడ్ సీఎం కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు అoటు రోజా ఆరోపించారు.
టిడిపి అరాచకాలను తట్టుకోలేని మహిళలు. మంత్రి పరిటాల సునీత పై చెప్పులు చీపుర్లతో తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.
మహిళలకు న్యాయం చేయలేని సునీత వైఎస్ జగన్ ను విమర్శించడం తగదని హితవు పలికారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా ఉందా అని సవాల్ చేశారు.
తనకు మరోసారి ఓటు వేయాలని చంద్రబాబు అడుగుతున్నారని, ఏమొఖం తో చంద్రబాబు నాయుడు కి ఓట్లు ప్రజలు వేస్తారని ప్రశ్నించారు.
నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకు చరమగీతం పాడాలని రోజా పిలుపునిచ్చారు.
వైయస్సార్ సిపి అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేసి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. చంద్రబాబు మోసాలు ఎంతోకాలం సాగవు అని .ప్రజలు అమాయకులు కాదని . ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పి తీరుతారని ఆ రోజు ఎంతో కాలం లేదని.
తప్పకుండా ప్రజలంతా వైఎస్ జగన్ కి పట్టం కడతారని అన్నారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ గమనిస్తున్నారని, పథకాల పేరుతో చంద్రబాబు ప్రజలను నమ్మబలుకుదమని అని చూస్తున్నారన్నారు.
ప్రజలు అమాయకులు కాదు అసాధ్యలుఅని బాబుకు కాదని ఎవరికి ఓటు వేయాలో వారు నిర్ణయించుకున్నారని తెలిపారు.
జగన్ ను సీఎం చేసేదాకా నిద్రపోరానిని అన్నారు. రానున్నది వైయస్సార్ ప్రభుత్వమని ప్రజలందరికీ మేలు జరిగేది జగన్ వల్లనేనని అన్నారు.