ప్రత్యేక పాటల మాల్గడి శుభ

నవరసాల మిళితమైన సినిమా సంగీతం లో ప్రత్యేకమైన గాత్ర ధర్మంలో ప్రత్యేకమైన గీతాలు పాడే గాయని మాల్గడి శుభ.

గమ్మత్తైన గొంతుతో, పదాల విరుపుతో తనకంటూ అభిమానుల్ని సంపాదించుకున్నారీమె.

శుభా రాజామణి అంటే ఈమె ఎవరా అనుకుంటాం కానీ ‘మాల్గడి శుభ’ అనగానే ఆమె రూపంతో పాటు హుషారు కూడా శ్రోతల్లో కనిపిస్తుంది.

ఈమె పుట్టింది ముంబయి. పెరిగింది డీల్లీ.

తన గాత్రానికి తనే పెద్ద అభిమాని అని చెప్పుకునే శుభ చిన్నప్పుడు బాత్ రూమ్ సింగర్ ని అంటారు.

ఉషా ఉతప్ ని రోల్ మోడల్ గా తీసుకున్న ఈమె , కిషోర్ కుమార్ పాటలకి గొప్ప అభిమాని.

పాప్ మ్యూజిక్ నే ఇష్టపడే శుభ , మొదట్లో శాస్ర్తీయ సంగీతాన్ని అస్సలు ఇష్టపడేవారు కాదు.

తల్లి బలవంతంగా సంగీత తరగతులకు పంపిన దగ్గర్నుండి అందులోని మాధుర్యాన్ని చవి చూసి , అప్పటి నుండి ఆ సంగీతాన్ని వదిలిపెట్టలేదు.

ఆమెకు సంగీతమంటే ఓ పాషన్ , పాడటమంటే వల్లమాలిన అభిమానం.

ఎలాంటి సంగీతం విన్నా ఉత్సాహం వస్తుందంటారు శుభ.

శుభ పదమూడేళ్ళ వయసులో జింగిల్స్ బాగా పాడేవారు. ఆ సమయంలో ఆమె పాడిన జింగిల్స్ విన్న ఫ్యామిలీ ఫ్రెండ్ న్యూస్ ఛానల్ లో పాడించారు.

శుభ చెన్నై వచ్చిన మొదట్లో ఎ.ఆర్.రహమాన్ , విజి మానియేల్ దగ్గర ఓకల్స్ , జింగిల్స్ పాడారు. విజిమానియేల్ ద్వారా ఇళయరాజా దగ్గర, అదే సమయంలో రాజ్-కోటి దగ్గర కూడా జింగిల్స్ పాడారు.

అలా దగ్గర దగ్గర 26 భాషల్లో జింగిల్స్ పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ‘నదోది తేండ్రల్’ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టినశుభకి, ఎ.ఆర్. రెహమాన్ తొలి ప్రైవేట్ ఆల్బమ్ ‘సెట్ మి ఫ్రీ’ (దీన్నే శుభ సెట్ మీ ఫ్రీ అని కూడా అంటారు)లోని అన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది.

లోకల్ లేబుల్ తో రిలీజ్ అయిన ఈ ఆల్బమ్ కి అప్పట్లో గుర్తింపు లభించలేదు. ఇదే ఆల్బమ్ తిరిగి 1996 లో రిలీజ్ అయ్యి బాగా ప్రాచుర్యం పొందింది.

రాజ్- కోటి సర్వ కల్పనలో వచ్చిన “మాల్గడి యొక్క గోల్ కొండ చూడవచ్చెనా (అతిరథుడు)” పాట ద్వారా ఈమె ఇంటిపేరు ‘మాల్గడి’గా మారిపోయింది.

విలక్షణమైన గొంతే ఆమెకు ప్రత్యేకత తెచ్చిపెట్టింది.

రాజ్ కోటి స్పరపరిచిన శుభ పాడిన చిక్ పక్ చిక్ బమ్ అనే తెలుగు ప్రైవేట్ ఆల్బమ్ పది లక్షల కాపీలు అమ్ముడు పోయే యంటే ఒక రకంగా ఆ సమయంలో అదంతా ఆమె గాత్రానికున్న క్రేజే.

సాధారణంగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో జింగిల్స్ లో పదాల స్వస్థత కనిపించదు వినిపించదు. కానీ మాల్గడి శుభ పాడిన ఏ జింగల్ విన్నా పదాల స్పష్టత కనిపిస్తుంది.

‘రక్షణ’లో “నీకు నాకు ఉన్న లింక్”, నిన్నే పెళ్ళాడుతా’ లో “నా మొగుడు రాంప్యారీ”, ‘ తపస్సు’లో “ఊగదు రాగం శూన్యంలో వెలగదు గగనం గ్రహణంలో”, ‘చత్రపతి’ లో “మన్నెలా తింటివిరా కృష్టా”, ‘ కొండపల్లి రాజా లో సింగరాయ కొండ కూడా ఆడ దిబ్బ కాడ’, ‘ జెంటిల్ మాన్’ లో “ముదినేపల్లి మడి చేలో ముద్దుగుమ్మ”,
గోకులంలో సీత’ లో ” హే పాప దిల్ దేదే పాప” వంటి పాటలతో శ్రోతల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో “ఇట్స్ టైం టు పార్టీ” పాటలతో చాలా ఏళ్ళు తర్వాత తిరిగి తెలుగులో తన గొంతును వినిపించారు శుభ.

పెళ్ళయ్యాక శుభా సురేష్ కైలాష్ గా మారిన ఈమె మాటల్లో ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉన్నా‌, అదే మోతాదులో శాస్త్రీయ ఆలోచనలు కూడా వినిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *