కాలిబాటన కొండెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జననేత జగన్

ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించి ఇచ్చాపురం నుంచి నేరుగా తిరుపతికి వచ్చి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు* తొలి మెట్టు వద్ద ప్రత్యేక పూజ అనంతరం నడక ప్రారంభించారు* మార్గ మధ్యలో గోవిందనామ స్మరణం చేసుకుంటూ ఎక్కడ విశ్రమించకుండా మూడు గంటల్లో కొండపైకి చేరుకున్నారు, మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు, ఆశీస్సు సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అనుసరించగా పాదరక్షలు లేకుండానే వైఎస్ జగన్ నడక ప్రారంభించారు, ప్రతిపక్ష నేత పై అభిమానుల పూలవర్షం కురిపించారు కార్యకర్తలు ప్రజలతో మెట్ల మార్గం అంతా సందడిగా తయారయ్యింది, భక్తి ప్రవత్తులతో వడివడిగా మెట్లెక్కే దారిలో ఎక్కడ విశ్రమించకుండా ముందుకు సాగారు, సామాన్య భక్తుడిగా దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని ముందుకు సాగారు వైయస్ జగన్, జగన్ సాయంత్రం 4 30 గంటలకు తిరుమల చేరుకున్నారు, అనంతరం శ్రీకృష్ణ అతిథిగృహంలో కాసేపు ఆగి సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దివ్య దర్శన్ టోకెన్ తో శ్రీవారి దర్శనానికి క్యూ లైన్ లో ప్రవేశించారు, ఆలయంలో కి వెళ్ళిన తర్వాత ధ్వజస్థంభానికి మొక్కి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు, స్వామివారి దర్శనం అనంతరం ఆనందనిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి మొక్కారు, శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని అన్నమయ్య బండా దారాన్ని దర్శించారు, హుండీలో కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు, అనంతరం యోగ నరసింహ స్వామిని దర్శించుకున్నారు తర్వాత రంగనాయక మండపంలో వేద పండితులు వైఎస్ జగన్ను ఆశీర్వదించి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం అందించారు దర్శనం అనంతరం రాత్రి ఏడు గంటలకు ఆయన బస్సు శ్రీకృష్ణ అతిథిగృహానికి వెళ్లారు, శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని శారద పీఠానికి చెందిన మఠంనికి జగన్ వెళ్లారు ఆయనకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి మఠంలోకి తీసుకెళ్లారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు

టిటిడి నిర్లక్ష్యం:

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారని ముందస్తుగా సమాచారం ఉన్న టిటిడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, తిరుమల చేరుకున్న జగన్కు టిటిడి ముఖ్య అధికారులు ఎవరూ స్వాగతం పలకలేదు, దివ్యదర్శనానికి 400 మందికి టోకెన్లు ఇచ్చిన ఆలయంలోకి వారిని అనుమతించలేదు, దీంతో కాస్త తోపులాట జరిగింది, టీటీడీ సెక్యూరిటీ విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది, టిడిపి నాయకులకు టికెట్లు లేకపోయినా అనుమతించే అధికారులు వైఎస్ జగన్ విషయంలో భిన్నంగా వ్యవహరించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *