నాటి ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల బాసటగా కేజీహెచ్కు చేయూత

ఆంధ్ర వైద్య కళాశాల కు అండగా నిలుస్తున్న పూర్వ విద్యార్థులు, 1923లో విశాఖలో రూపుదిద్దుకున్న ఆంధ్ర వైద్య కళాశాలలో ఇప్పటి వరకు 15 వేల మంది వైద్య విద్యను అభ్యసించారు, వీరిలో ఎంతో మంది మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు, చదువుల తల్లి సేవలో తరిస్తూ మౌలిక పరమైన వస్తులను మెరుగుపరచడం వైద్య పరికరాలను సమకూర్చడం క్యాన్సర్ వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించడం, గ్రంథాలయంలో ఆధునిక వసతులు కల్పన ఈ గ్రంధాలయం ఏర్పాటుతో సహా వివిధ రకాలుగా చేతులు అందిస్తున్నారు, 2023 నాటికి వైద్య కళాశాల ఏర్పడి వందేళ్లు అవుతుంది, ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శతాబ్ది బ్లాక్ పేరుతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు, వైద్య కళాశాల వెనుక భాగంలో ఆడిటోరియం భవనం 2014 హుదూద్ తుఫాన్ కుప్పకూలిపోయింది, ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ వైద్యుల వైద్యుల సంఘం ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఇక సెంటినరీ బ్లాక్ పేరుతో అత్యాధునిక వసతులతో భవంతి నిర్మాణానికి ముందుకు వచ్చాయి, విద్యార్థులతోపాటు ప్రభుత్వం కూడా ఇస్తోంది, దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మితమైన పెథాలజీ బ్లాక్ శిథిలావస్థకు చేరుకుంది పెంకులతో ఉన్న భవంతి పైకప్పులో అధికశాతం అది తుఫాన్ ధాటికి బాగా దెబ్బతింది, పూర్వ విద్యార్థి డాక్టర్ రవి శర్మ ఈ భవన పునరుద్ధరణ వసతుల కల్పనకు 1.5 కోట్లు విరాళం ఇచ్చారు రవి శర్మ అమెరికాలో స్థిరపడ్డారు, ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి, అమెరికాలో స్థిరపడిన ఏఎంసి పూర్వ విద్యార్థుల సంఘం అంకన్న కేజీహెచ్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది, ఖరీదైన మెమో గ్రఫీ యంత్రాన్ని కేజీహెచ్లో ఏర్పాటు చేశారు, డాక్టర్ నాగుల సీతారామయ్య ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది, 1966 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ వంతు 10 లక్షల ఖర్చుత విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు, ప్రస్తుతి విభాగ లేబర్ రూమ్ విస్తరణకు 40 లక్షల సహాయం అందించారు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రాంగణంలో ఆరుబయలు రంగస్థలం ని అభివృద్ధి చేశారు 1960 బ్యాచ్కి చెందిన డాక్టర్ జె వి సుబ్బారావు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ యస్ వి ఆదినారాయణరావు కలిపి మొత్తాన్ని సమకూర్చారు, 1975 బ్యాచ్కు చెందిన పూర్వ వైద్య విద్యార్థులు 20 లక్షల ఖర్చుతో అనాటమీ విభాగాలను అభివృద్ధి చేశారు, ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోసం 25 లక్షలు విలువ చేసే శీతలీకరణ బస్సును సమకూర్చింది, ఆంధ్ర వైద్య కళాశాల కు పూర్వ పూర్వ విద్యార్థులు గొప్ప ఆస్తి వారి చేయూతతో కళాశాలలో ఎన్నో వసతులు సమకూరాయి దేశవిదేశాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా తమకు చదువు చెప్పిన ఈ కళాశాలను వారు మరువలేదని ఇక్కడి నిర్మాణాలు విరాళంగా వచ్చిన వైద్య పరికరాలు నిదర్శనం, ఇక్కడి వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కళాశాలలో అవసరాలు తెలుసుకుంటూ ఏఎంసి కష్టనష్టాల్లో పాలు పంచుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *