ఐదేళ్లగా ఉద్యోగ, కార్మికులకు తీరని అన్యాయం చంద్రబాబు హయాంలో కార్మికుల సంతృప్తిగా లేరు

CM Chandrababu to Announce MLA Candidates List for AP

CM Chandrababu to Announce MLA Candidates List for AP

పెండింగ్ లోనే 010 పద్దు, కనీస వేతనాలు పీఆర్ సీ , ఐఆర్
జగన్ అధికారంలోకి రాగానే వెంటనే సమస్యలు పరిష్కారం
వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వామనరావు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, కార్మిక, ఏ రంగంలో వారికి కూడా తగిన న్యాయం జరగలేదని,నిరంకుశ పోకడలతో,కార్మిక వ్యతిరేక విధానాలతో తన పాలన కొనసాగిస్తానన్నారని. వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వి. వామనరావు అన్నారు యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంఘటిత , అసంఘటిత కార్మికులు ఐదేళ్లుగా పోరాటాలు సాగించడమే తప్ప, ఇంతవరకు ప్రభుత్వం ఆయా డిమాండ్లు పరిష్కరించకపోవడం విచాకరమన్నారు. 11వ పీఆర్ సీ కమిటీ ఆలస్యం అవుతుందని. అయినప్పటీకి. ఐఆర్ కూడా ప్రకటించలేదన్నారు. 2018 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఇప్పటికే మూడు డీఏలు ఇవ్వాల్సి వుందన్నారు. వివిధ సంఘాలు డిమాండ్ మేరకు కనీస వేతనాలు కూడా కార్మికులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ విజయవాడ కార్పొరేషన్ లో 010 పద్దు అమలు చేయడం లేదన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల జీతాలు అందించేందుకు వీలుగా దీన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని చంద్రబాబు తన ప్రచార కార్యక్రమం కోసం ఖర్చు చేయడం గమనార్హం అన్నారు. కార్మికుల సంక్షేమ నిధులను “చంద్రన్న బీమా పథకం కలర్ వేయడం అన్యాయమన్నారు.

తద్వారా కార్మికులకు చంద్రబాబు మోసగించారు అన్నారు. వెలుగు, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు , డీఆర్డీఏ ,డుమా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలా అన్ని విభాగాల్లోనూ కార్మికులు, ఉద్యోగులు చంద్రబాబు హయాంలో అష్ట కష్టాలు పడుతున్నారని వామనరావు వాపోయారు. ఆటో డ్రైవర్లు రాష్ట్రంలో లక్షలాది మంది వుంటే రోడ్డు టాక్క్ తీయాలని చాలా కాలంగా అడుగున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. దీని ద్వారా లక్షలాది మంది ఆటో కార్మికులకు అవస్థిలు పడుతున్నారన్నారు. హెల్త్ కార్డులు, రియాంబర్స్ మెంట్ పై కూడా లేవన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక ఉద్యోగ లోకం చంద్రబాబు వైఖరి పై మండి పడుతున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్మిక ఉద్యోగుల పక్షాన నిలుస్తోందన్నారు. ఎన్నికల మేన్ ఫేస్టోలో కూడా వీటిని పొందుపరిచనున్నట్టు తెలిపారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కార్మిక, ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిననున్నట్టు తెలిపారు.

7 రోజుల్లోనే సీపీఎస్ విధానం రద్దు చేయడంతో పాటు అడగకుండానే డీఏ జనవరి, జూలైలో ప్రకటించనున్నట్లు తెలిపారు. పీఆరసీ ఐఆర్ తో సంబంధం లేకుండా ప్రకటించినున్నట్టు తెలిపారు. విశాఖ విజయవాడ లో 010 పద్దు అమల్లోకి వచ్చేలా నెల రోజురల్లో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ కు ఇబ్బంది లేకుండా రోడ్డు టాక్స్ రద్దు పరచనున్నట్టు తెలిపారు. కనీస వేతనం వెంటనే అమల్లోకి తేవడంతోపాటు , మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, డీఆర్ డీఏ , డుమా ఫీల్డ్ అసిస్టెంట్ లు సమస్యలు పరిష్కరించడం జరంగుతుందని , కార్మిక నిధి పక్కపట్టకుండా చర్యలు తీసుకుంటున్ళట్టు తెలిపారు. కార్మిక శాఖ పర్యవేక్షణ బాధ్యత ఉండేలా చర్యలు తీసుకుంటునున్నట్లు తెలిపారు. కార్మికులు , ఉద్యోగులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని బలపరిచి, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తేవాలని, తద్వారా అందరి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా దోహదపడాలని వామనరావు పిలుపు నిచ్చారు. జగన్ నేతృత్వంలోనే త్వరలో రాష్ట్రంలో రొజన్న రాజ్యం రాబోతున్ళదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *