50 ఏళ్లు నటుడిగా సినీ ప్రయాణం చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

నటుడిగా 50 ఏళ్లు ప్రయాణం చేశాను ఇంకా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాను. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో పాత్రలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు పోషించగలను అనుకుంటున్నాను. అలాగే రాజకీయాలలో కూడా పార్టీ ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేస్తాను అని నటులు కృష్ణంరాజు అన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణంరాజు సినిమా, రాజకీయాలకు సంబంధించి పలు విశేషాలను పాలుపంచుకున్నారు. బర్త్డే ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌత్, నార్త్ కు సంబంధించిన celebrates ని అందరినీ పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈ పంక్షన్ ఎప్పుడు చేయాలనుకున్నా కుదరలేదు.

మాతో ప్రయాణం కొనసాగిస్తున్న అభిమానులను సన్మానించాలి అనుకుంటున్నాను త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా. ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆంధ్ర ఎన్నికలు ఇంకా హిట్ ఎక్కలేదు, పార్టీ అడుగుతే ప్రచారం చేస్తా. సంక్రాంతికి మా ఊరు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. పార్టీ పని మీద ఢిల్లీ వెళ్లి వచ్చాను. ఊరు వెళ్ళటం కుదరలేదు. నటుడిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలు చేయాలని లేదు. మన పాత్ర కథకు, సినిమాకి కీలకంగా ఉండాలి. అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఓ2 సినిమాలు డిస్కషన్ లో ఉన్నాయి త్వరలో ప్రకటిస్తారు.

మహానటి సినిమా చాలా ఎక్ష్ ఆర్డినరీ గా ఉంది. డైరెక్టర్ నాగీ, కెమెరామెన్ థానీ అద్భుతంగా చేశారు. కీర్తి సురేష్ కైతే ఫుల్ మార్క్స్. సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలను చూపించారు కాబట్టి బాగుంది. ఎస్ వి రంగారావు గారి బయోపిక్ కూడా చూడాలని ఉంది. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ చేయగలడు అనుకుంటున్నాను. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్ తో లవ్ స్టోరీ చిత్రం నిర్మిస్తున్నాం. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తయింది. అందులో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కథలు కుదిరితే కచ్చితంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం కొనసాగిస్తాం. మన బిడ్డను ఐదేళ్ల వరకు దేవుళ్ళ చూడాలి 5 నుంచి 18 వరకు సేవకుడిలా చూడాలి. ఆ తరువాత స్నేహితుడిలా చూడాలి. మా నాన్నగారు నాకు చెబుతూ ఉండేవారు. నాకు ప్రభాస్ మధ్య అనుబంధం బాగుంది.

50 ఏళ్లుగా యాక్టివ్గా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇండస్ట్రీ లో పెద్దగా మార్పులు అంటూ ఏమీ రాలేదు. అందరూ బాగానే కష్టపడుతున్నారు. అప్పుడు హీరోస్ అందరం బాగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా అందరూ కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు. మహేష్, ఎన్టీఆర్, చరణ్ వీరందరినీ చూస్తూనే ఉన్నాం కదా. మావాడు ప్రభాస్ కూడా అందరితో బాగుంటాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. సాహో సినిమా తర్వాత కచ్చితంగా పెళ్లి ఉంటుంది. బాహుబలి తరువాత తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయంగా అంతర్జాతీయంగా పెరిగింది. అందరూ మన తెలుగు సినిమాల వైపు చూస్తూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. సాహో సినిమా భారీ లెవల్లో తీస్తున్నారు.

మొన్నీమధ్య దుబాయ్ వెళ్లి ఫైట్ సీన్స్ తీశారు సినిమా చాలా బాగా వస్తుందట ఈ కృష్ణం రాజు గారు తన మనసులోని మాటలను ఈ విధంగా మనతో పాలుపంచుకున్నారు. నిండు నూరేళ్లు నటుడిగా రాజకీయ నాయకుడిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *