లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాల శంఖారావం బీజేపీపై యుద్ధభేరి

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం కోల్ కత్తాలో చారిత్రాత్మక ది గ్రేట్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యత భారత్ రాలి లో వారు పాల్గొని శంఖారావం చేశారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ సహా దేశంలోని 22 పార్టీలకు చెందిన అగ్రనేతలు కోల్కత్త వేదికగా కేంద్ర సర్కారు తీరుపై గళమెత్తారు. మోదీ సర్కార్ కు కాలం చెల్లిందని, రాబోయే ఎన్నికల్లో బిజెపికి మిగిలేది వాట మేం అని తేల్చి చెప్పారు. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని. విజయ దుందుబి మోగించింది విపక్షాల కూటమేనని . తమ మధ్య విభేదాలు ఏమైనా ఉన్నా వాటిని విడనాడి. ఏకతాటిపైకి వచ్చి మోదీని ఇంటికి పంపుతామన్నారు. మోదీ సర్కార్ పై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు.

అధికారంలోకి రాకముందు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బిజెపి ఇతర పార్టీల నేతలు ఆరోపించారు. బిజెపి సర్కార్ ను ఇంటికి సాగనంపటం తమ ఉమ్మడి లక్ష్యం అని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయోత్సవం జరిగేది ఇదే వేదికపై నుంచి శనివారం కలకత్తాలో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అమరావతి సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే తరహా బహిరంగసభలో మరిన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ఎవరనేది సమస్య కాదు దానిని ఎన్నికల తర్వాత మేము నిర్ణయించుకుంటాం వీరి హయాంలో పెద్దపెద్ద కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీలు ఈ సమావేశానికి హాజరు కాకపోయినా పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే, అభిషేక్ మను సింగ

అభిషేక్ మను సింగ్ వాళ్లను పంపించారు. సోనియా సందేశాన్ని ఖర్గే చదివి వినిపించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సామాన్యమైనవి కాదని ప్రజాస్వామ్యంపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరించాల లౌకిక విలువలను పరిరక్షించుకునే లఇవి మిగిలిపోతాయని సోనియా తన సందేశంలో పేర్కొన్నారు. అహంకారపూరిత విభజనవాద సర్కారుపై పోరాటంగా అభివర్ణించారు. దేశంలో రైతులు యువత మత్స్యకారులు సహా అన్ని వర్గాల వారు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని ఆఖరికి అది సరిహద్దుల వరకు విస్తరించిందని విమర్శించారు. మనసులు కలవకపోయినా చేతులు కలపాల్సి ఉంటుందని అన్నారు.

సమావేశంలో బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా, జేడీయూ అధినేత శరద్యాద,వ్, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, అఖిలేష్ యాదవ్, అరవింద్ క్రేజీవాల్, దేవగౌడ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, అజిత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు రక్షణ మంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుఘ్న సిన్హా, మాజీ సీఎం అపాంగ్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *