ఎన్నికల శంఖారావం పూరించిన పవన్ కళ్యాణ్…… వామపక్షాలతో కలిసి విజయ పతాకాన్ని ఎగుర వేయడం ఖాయం.

రానున్న ఎన్నికలలో వామపక్షాలతో కలిసి జనసేన విజయ పతాకాన్ని ఎగుర వేస్తుంది, ఇది ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు.

గుంటూరులోని ఆదివారం జరిగిన ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ 175 శాసనసభ స్థానాల్లో ను, 25 లోక్ సభ స్థానాల్లో ను స్థానాల్లోనూ వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.

వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు వచ్చే ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.

టిడిపి, వైసిపి లు జనసేన ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ ఆ రెండు పార్టీలను ఎదుర్కొంటామని చెప్పారు.

“నాకు భయం లేదు, ప్రజలను మోసం చేయను, పొత్తులతో పాటు అన్ని విషయాలు చెప్పే చేస్తాను” అని ఆయన అన్నారు.

గుంటూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ‘తోట చంద్రశేఖర్’, ‘నాదెండ్ల మనోహర్’ లను తన అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

ప్రత్యేక హోదా విషయంలో తరచూ చంద్రబాబు మాటలు మారుస్తున్నారు అని అన్నారు.

జగన్ ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్ని పార్టీలు, పార్టీలకు అతీతంగా ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని అన్నారు.

ప్రధానమంత్రి ని అడిగితే తనకు రాజ్యసభ సభ్యత్వం తో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని, కానీ తాను బీజేపీతో రాజీ పడకుండా పోరాటం చేస్తున్నాను అని అన్నారు.

తనకు మళ్లీ అవకాశం వస్తే తన కుమారుడు లోకేష్ ను సీఎం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు, 30 ఏళ్ల పాటు అధికారం ఉండాలని కోరుకుంటున్న వైఎస్ జగన్ సామాన్య ప్రజల కష్టాలను, దేశ అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు.

అద్భుతమైన రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు ఇప్పటివరకు తాత్కాలిక భవనాలకు మాత్రమే పరిమితమయ్యారని అన్నారు.

ఒక బలమైన సామాజిక మార్పు తీసుకు రావడమే జనసేన ధ్యేయమని అన్నారు.

‘మాది రెల్లి కులం’ అన్న ఆయన అవినీతికి, కులాలకి తావులేని పాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలన్నదే ఆయన ఆశయం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *