జయహో బీసీ సదస్సు…. వరాలు వెదజల్లిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ అని చంద్రబాబు అన్నారు.

పార్టీల్లోనూ, పదవుల్లోనూ వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేస్తామన్నారు. ప్రతిపక్షంలో వున్నా, అధికారంలో వున్నా కూడా బీసీలకై పోరాడిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు.

ఆదివారం రాజమహేంద్రవరం లో జరిగిన జయహో బీసీ సదస్సులో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను బీసీలను చేశామని, మంత్రివర్గంలో ఎనిమిది మందికి అవకాశం కల్పించారని గుర్తుచేశారు.

ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖతో పాటు 25 శాతం బడ్జెట్ పెట్టామని అన్నారు.

ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు.

తను ఏ పని చేసిన బీసీల కోసమే చేస్తానని బీసీలకు తమ ప్రభుత్వంలో అత్యున్నత పదవులు ఇచ్చామని చెప్పారు.

CM Chandrababu to Announce MLA Candidates List for AP
CM Chandrababu to Announce MLA Candidates List for AP

ఆదరణ పథకం కింద వెనుకబడిన వర్గాల వారికి పనిముట్లు అందజేశామని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని వెనుకబడిన వారిని వైయస్ అణగదొక్కారని విమర్శించారు. 31 కులాలను బీసీ లోకి చేర్చకుండా రిజర్వేషన్లు ఇవ్వకుండా వైయస్ అన్యాయం చేశారన్నారు.

వైయస్ హయాంలో నేత, కల్లుగీత, స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని, బీసీ మంత్రులు జైలు పాలయ్యారని ఆరోపించారు. 11 బీసీ ఫెడరేషన్ నిర్వీర్యం చేసి బీసీ నేతల ని హత్య చేశారని ఆరోపించారు.

100 నుంచి 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

బీసీల్లోని నాయిబ్రాహ్మణులు, స్వర్ణకారులు నేతన్నలకు మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్, తూర్పు కాపులు, అగ్నికుల క్షత్రియులు, వర్ణికుల క్షత్రియులు, శెట్టి బలిజ, ఈడిగ, యాదవ, శ్రీ శయన, లకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

విదేశీ విద్య కింద వెనుకబడిన వర్గాల వారికి 15 లక్షలు ఇస్తామన్నారు. సబ్ ప్లాన్ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పిస్తామన్నారు.

బీసీలకు కార్ల కొనుగోలుపై 25 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.

బుడబుక్కల, దొమ్మర సంక్షేమానికి కమిటీ వేస్తామన్నారు. వెనుకబడిన బీసీలకు ఇచ్చే సబ్సిడీని 30 వేల నుంచి 50 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు.

100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు.

కించపరిచే విధంగా కులాల పేర్లు వాడకుండా ఉండేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.

జగన్ తెలంగాణలో బిసి రిజర్వేషన్ల రద్దుకు మద్దతు పలికారని మండిపడ్డారు. బీసీలను మద్దతు కు వత్తాసు పలకడం దారుణమని అన్నారు.

బీసీలను దెబ్బతీసేందుకే వైసీపీ బీజేపీ కుట్ర పన్నారు అని, తాను బీసీ కి అండగా ఉన్నారని గుర్తు పెట్టుకుంటే మంచిది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *