వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అభ్యర్థుల ప్రకటన జోరందుకుంటోంది

Jagan to declare 100 Assembly candidates at one go!

Jagan to declare 100 Assembly candidates at one go!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకదాని తరవాత మరొక నియోజకవర్గంలో అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.

జగన్ పాదయాత్ర పూర్తి అయిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటిస్తూన్నారు.

ఒకటి రెండు సీట్లకు అభ్యర్థులను జగన్ స్వయంగా ప్రకటించారు.పార్టీ ఇంఛార్జి లు లు కూడా ఈ విషయం మీద ప్రకటనలు చేస్తూ ఉన్నారు.

మరికొన్ని చోట్ల అభ్యర్థులను పరిచయం చేసారు జగన్ మోహన్ రెడ్డి.

కొన్నిచోట్ల మినహాయిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించుగా ఇంఛార్జి ల కే పట్టం కడుతూ వస్తోంది.

గత ఎన్నికల్లో పార్టీ ఓడిన నియోజకవర్గాల్లోని ఇంఛార్జి లుగా వ్యవహరిస్తున్న వారిని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా తెలుగుదేశం మీడియా ప్రత్యేక కథనాలను ప్రచారం చేస్తూ తన ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

జగన్ నిర్ణయంతో వారు మండి పోతున్నారని కథనాలను సృష్టిస్తోంది.

హైలైట్ చేస్తూ అభ్యర్థుల గురించి ప్రస్తావిస్తూనే పలానా వారిని ప్రకటించడం చేత ఫలానా వారు అసంతృప్తులు అయ్యారు అని తన ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

జగన్ నిర్ణయంతో వారు మండి పోతున్నారని కథనాలను సృష్టిస్తోంది. ఇలాంటి కథనాలు రాయడం సంగతి అలా ఉంచితే తెలుగుదేశం కథ మాత్రం ఆ పార్టీ అనుకూల మీడియా కూడా అర్థం అవుతున్నట్టుగా అని అనిపించడం లేదు.

అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటనలు ఏమీ లేవు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు జమ్మలమడుగు పంచాయితీ పైనే చూస్తున్నారు, కానీ అది కూడా తేలడం లేదు.

జనవరి పూర్తికావస్తున్న ఇంకా అభ్యర్థులుగా ఎంపిక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *