ఎన్టీఆర్ భరోసా డబల్ పెన్షన్ కోసం వృద్ధుల తిప్పలు

ఎన్టీఆర్ భరోసా డబల్ పెన్షన్ కోసం వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు.

అధికారులు సవాలక్ష సాకులు చూపుతూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. చివరకు సహనం నశించి ఎదురుతిరిగే స్థాయికి వెళ్తున్నారు.

ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డబల్ పెన్షన్ అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.

పసుపు కుంకుమ అంటూ పదివేలు ఆశ చూపుతున్నారు. అయితే ఆ చిన్న లో అడుగడుగునా అధికారుల అవినీతికి మహిళలు బలవుతున్నారు. ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కానరావడం లేదు.

కొంతమంది అధికారులు కారణంగా బాబు ప్రచారం వట్టి మాటలు, నీటి మూటలు గా మిగిలి పోతున్నాయి.” ఏటి ఈతకు లంక మేత”కు సరిపోతుంది అనే సామెతను మహిళలు గుర్తుచేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ భరోసా కోసం ఉదయం నుంచి వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. కార్యాలయం గేట్లు సైతం తెరవకపోవడంతో తలుపులు వద్ద పడిగాపులు పడుతున్నారు.

అలాగే కొండ వీటి చాటడంట లైన్ లో నుంచుని వెళ్తే ,చివరకు నీ పెన్షన్ పెండింగ్లో ఉందని బయోమెట్రిక్, వేలిడేషన్ అవ్వలేదనో ఏదో సాకు చూపుతున్నారు.

కొత్త పెన్షన్ల మంజూరులో చేతివాటం చూపుతున్నారు. అలాగే పసుపు కుంకుమ లో పెద్ద ఎత్తున అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని మహిళలు గొంతెత్తి నినదిస్తున్నారు.

జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలుగు మహిళలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *