సహజ విదూషీమణీ విలేజ్ సింగర్ బేబీ

మట్టి మనిషి అయిన తనను మంచి మనిషిగా తీర్చిదిద్దారని, అందరి సహకారం ప్రోత్సాహం తో మంచి మంచి పాటలు పాడుతున్న ని. విలేజి సింగర్ పల్లె గాయనీమణి పసాల బేబీ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశిలేరు గ్రామానికి చెందిన తనుపొలాల్లో పని చేస్తూ నచ్చిన పాటలు పాడుతూ ఉండేదని అన్నారు.
తన పాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో సినిమాల్లో పాటలు పడే అవకాశాలు వస్తున్నాయన్నారు.
ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో పాటలు పాడన నిసంగీత దర్శకుడు కోటి ,డాక్టర్ విజయలక్ష్మి లు తనకు చేయూతనిచ్చారు అని చెప్పారు.
పాటలు పాడటం దేవుడిచ్చిన వరం అని అక్షర జ్ఞానం లేని నాకు పాడేశక్తి ఉందన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కోటి తండ్రితో సమానమని దేవుడు పంపిన దూత నీ ,చేయూతనిచ్చి చదవాలని ఆశ నుఆయనే కల్పించరని తెలిపారు.
కోటి తనకు హైదరాబాద్ లో అక్షరాభ్యాసం చేయిస్తున్నారని చెప్పారు.
5 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలు పెట్టాను అన్నారు. తమ్ముని ఉయ్యాలలో వేసినప్పుడు లాలి లాలి లాలమ్మ లాలి అనే పాటను పాడన తనకు అమ్మమ్మ ప్రోత్సాహం కూడా ఉందన్నారు.

తాము తల్లికి ఐదుగురు పిల్లల మని తనకు చదువు అబ్బ లేదని పాటలు విని పాడే దానిని వివరించారు. ప్రియసఖీయా అనే పాట అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.
గాయనీ గాయకులు జానకి, బాల సుబ్రహ్మణ్యం పాటలు అన్న చాలా ఇష్టమని చెప్పారు.
భవిష్యత్తులో ఎటువంటి శిఖరాలు అందుకోవాలని లేదని కూలి పని చేసే తనకు సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు రావడం అద్భుతమని బేబీ అన్నారు.
ఏయూ అకాడమిక్ స్టాప్ కాలేజీ లో ఆదివారం వైజాగ్ ఫిలిం సొసైటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో విలేజ్ సింగర్ బేబీ ని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విసీ మాట్లాడుతూ సంగీత సాధన లేకుండా కళాకారిణి అయిన బేబి కెదక్కిందన్నారు.
అక్షర జ్ఞానం లేకుండా తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఘనత బేబీ కే దక్కుతుందని ప్రశంసించారు.
బేబీ ఏకసంతాగ్రహి అని ఆమె మేధస్సు పై పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు.
సంగీతం సాహిత్యం రచనలు అంటే ఏమిటో తెలియకుండా తన పాట శైలిలోనే మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నారు.