అమరావతిలో జగన్ నూతన గృహప్రవేశం

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసం లో అడుగుపెట్టనున్నారు.

గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. 20 19 ఫిబ్రవరి 14 తేదీన ఉదయం 8 గంటల 21 నిమిషాలకు జగన్ గృహప్రవేశం చేస్తారు. తాడేపల్లి బైపాస్ రోడ్ సమీపంలో జగన్ సొంత నిర్మించుకున్నారు.

గృహప్రవేశానికి ఇంటి సభ్యులు, కొందరు ముఖ్య అతిథులు మాత్రమే వస్తారని సమాచారం. అదే రోజు జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని సమాచారం.

కేసీఆర్ కూడా హాజరవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి కీలక నాయకుడు హాజరవుతారని అనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పార్టీ నడిపించాలని. ఇక్కడ నుంచే పర్యటనలు, ప్రచారం నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం తాడేపల్లి లో శాశ్వత నివాసం నిర్మించుకున్నారు. పాదయాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సమరభేరి మోగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు.

హైదరాబాదులో నివాసం ఉంటే ప్రయాణాలకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని, పక్క రాష్ట్రంలో ఉన్నారని అపవాదును కూడా తొలగించుకోవాలని ఆలోచనతో అమరావతి నుండి రాజకీయాలు నడపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నారు.

జగన్ నివాసానికి సమీపంలోనే వైసిపి పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీ లోనే నివాసం ఏర్పరచుకోవడం వలన కర్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం ఉంటుందని.

పార్టీ శ్రేణులతో పార్టీ కోసం సమాలోచనలు చేయటానికి బాగుంటదని, ఎన్నికల సమయం కూడా దగ్గర పడటంతో ఈయొక్క గృహ ప్రవేశాన్ని త్వరిత గతిన చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *