ఎన్నికల్లో విజయం కోసం ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడం సరి కాదంటున్న వెంకయ్యనాయుడు

ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

దక్షిణ భారత భవిష్యత్తు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు, సవాళ్లు అన్న అంశంపై, ఆదివారం నిర్వహించిన ది హండిల్ సదస్సులో ఆయన ప్రసంగించారు.

రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలేకాని తాత్కాలిక ప్రయోజనాలు అయినా రుణమాఫీ వంటి పథకాలను ప్రకటించరాదని సూచించారు.

ఇలాంటి పథకాలతో ప్రభుత్వం పై ఆధారపడె తత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వయం సమృద్ధి సాధించాలంటే దీర్ఘకాలిక ప్రయోజనాలునా పథకాలకు రూపకల్పన చేయాలన్నారు.

ఇలాంటివి దేశాన్ని ఆర్థిక కoగ బలోపేతం చేస్తాయని విశ్లేషించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు సమతుల్యం పాటించాలి. పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టు తప్పుతుందని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *