చంద్రబాబు బయోపిక్ మేలు చేస్తుందా?… కీడు చేస్తుందా?

ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితం, రాజకీయ చరిత్ర ఇతివృత్తంతో నిర్మిస్తున్న చిత్రం చంద్రోదయం. కథ మాటలు దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వినోద్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గా నటించారు.

గత సంవత్సరం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. అయితే ఇందులో చంద్రబాబు గెటప్పు చాలా కామెడీగా ఉండటం గమనార్హం.

అప్పడే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు కూడా పేలాయి. ఈ చిత్రం విడుదల అయితే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని టిడిపి అభిమానులు కూడా అనుకుంటున్నారు.

అయితే సినిమా తీసిన వారు ఊరుకుంటారా ఈ చిత్రం మార్చి 10న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తునటు చిత్ర నిర్మా తజీవీకే రాజేంద్ర తెలిపారు. విశేషం ఏమిటంటే మార్చి 10 ఆదివారం కావడం అసలు పరీక్షల సీజన్లో సినిమా విడుదల చేయడమే తప్పు. అటువంటిది ఆదివారం రిలీజ్ చేయండo ఏమిటో?.

అసలు ఇంత చిన్న నిర్మాత సినిమా విడుదల చేయగలడా? ఒకవేళ చేసినా ఆ పోస్టర్లు చూసి ఎవరైనా సినిమాకు వస్తారా? నాలుగు డబ్బులు కూడా రాకపోతే సోషల్ మీడియాలో జోకులు మళ్ళీ పేలుతాయి.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవసరమఇటువంటి సాహసం? చంద్రబాబు నిజాయితీ గా సమాజానికి చేస్తున్న సేవలు ప్రజలకు తెలియజేయాలని లక్ష్యంతోనే ఈ సినిమా చేస్తున్నామని వెంకటరమణ చెప్పారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే చంద్రోదయం పేరిట రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు చిత్ర నిర్మాత చెప్పారు.

చంద్రోదయం రాజకీయ చరిత్ర కథాంశంగా చంద్రోదయం 1ను మార్చి 10న విడుదల చేస్తున్నామన్నారు. ఆయన జీవిత చరిత్ర కథాంశంగా చంద్రోదయం 2ఉంటుందన్నారు.

మొదటి భాగంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన పేదల కోసం చేపట్టిన వివిధసంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూపిస్తామన్నారు.

అంటే ముందు ది వెనక వెనక ది ముందు అన్న మాట అలా చేస్తే ఎన్నికలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *