N.C.Babu clearning the line for Lokesh

బాబుకు రేపు ఢిల్లీ స్థాయిలో కొత్త ఉద్యోగం కుదిరితే ఇక్కడ చిన్న బాబు కు లైన్ క్లియర్ అవుతుంది. అంటే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేంద్రమంత్రిగా స్థిరపడితే ఇక్కడ వారసుడు రంగప్రవేశం చేస్తాడన్నమాట. ప్రస్తుతానికి చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాలి. కేసీయర్ ఉన్నంత అనుకూలత బాబు కు లేదనే చెప్పాలి. కేసీయర్ వ్యవహారం వేరు. ఆయన ముందస్తుకు ఎన్నికల్లో మళ్లీ గెలిచి ఇప్పుడు బరువు దించుకున్నారు. బంపర్ మెజార్టీ కొట్టడంతో అక్కడ విపక్షాలు కనీసం సద్దు చేసేందుకు కూడా ఆస్కారం లేదు, సొంత పార్టీ పెట్టు చాకిరి గానే ఉంది దాంతో తాను అనుకున్నది చూసుకుంటూ పోతున్నారు . రేపటి రోజు కేటీఆర్ను సీఎంగా ప్రకటించినా అడిగేవారు లేరు, అయితే ఇక్కడ చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ లో ఉంది చంద్రబాబు వ్యవహారం అలా కాదు, ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. బలమైన ప్రతిపక్షం వైసీపీ ఉంది , కొత్తగా వచ్చిన జనసేన ఉంది.