ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఒళ్ళు తెలియకుండా హామీలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…..

సరిగ్గా 2014 ఎన్నికల సమయం…..చంద్రబాబు గారు టీడీపీ తరుపునవారి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు……అదే సమయం లో ఆయనకు హఠాత్తుగా విశాఖపట్నం జిల్లా గుర్తుకొచ్చింది. అక్కడ రాజకీయంగా చైతన్యవసంతమైన ఎన్నో కులాల్లో ఒకటైన గౌరీయుల కులం గుర్తుకొచ్చింది.

అంతే…..ఒక్కసారిగా …..

ఈ గవర కులం కోసం ఏదో ఒక హామీ ఇవ్వాలనుకున్నారు.హామీ ఇచ్చేసారు.మేనిఫెస్టో లో పెట్టేసారు.

2014 ఎన్నికలలో గవర కులస్థులకు ,టీడీపీ మనిఫెస్టో లో హామీగా కేటాయించి ఇచ్చిన హామీ…..గవర లను ప్రస్తుతము బీసీ D లో వున్నారు.వీరిని బీసీ A కి మారుస్తానని ….. కానీ నేటికి కూడా…గౌరీయులు ఆ హామీ ని పొందలేదు.సరికదా ఇప్పుడు ఇంకోకటి.

ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఉంది.తెలంగాణా లో గవరలకున్న బీసీ D గుర్తింపుని రద్దుచేసారు.అంటే ఉన్నది పోయింది.ఇప్పటికి గవర్లు ఈ విషయమై పలు కోర్టుల్లో కేసువేసి నేటి తెలంగాణా ప్రభుత్వం పై పోరాటం చేసి ఓడిపోయి ఉనికి కోల్పోయారు.అనే విషయం గవరలు గౌరీయులు అని జబ్బలు చారుచుకుంటున్న ఎంతమంది గౌరీనాయకులకు తెలుసు.మరెంతమంది గౌరీయులకు తెలుసు???

తెలుగుదేశం ప్రభుత్వానికి గాని ,చంద్రబాబుకి గాని చిత్తశుద్ధి నిజంగా ఉండివుంటే, 2014 నాటి మేనిఫెస్టో ని చూసి గౌరీయులకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎందుకు చేయలేకపోయారో వివరణ ఇవ్వాలి.

బీసీ సంఘం లో పలు పోస్టులు చేస్తున్న పెద్దమనుసులుగాని ,కులస్థులుగా పార్టీ సీట్ లు సందించి గెలిచిన MLA, MLC లు గాని ,…గవరలను బీసీ D నుంచి బీసీ A కి ఉన్నతి కల్పించే హామీ విషయంలో ఎప్పుడైనా ,ఏ నాయకుడైనా గళం విప్పిన వైనం ఎప్పుడైనా జరిగిందా…అసలు వీళ్లకు అవగాహన ఉందా….నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోండి.

ఈరోజు ,చంద్రబాబు గారు తన విశ్వసనీయత కె అనుమానం వచ్చేట్టు వాగ్ధానాలతో వూగిపోతున్నారు

నోటికి ఎంతవస్తే అంత ,ఎవరు ఏది అడిగితే అది అనే చందంగా ఒళ్ళు తెలీయని మైకమ్ లో అధికార దాహం తో ,పదవే లక్ష్యంగా , వరాలు వాగ్దానాలు చేసేస్తున్నారు.

బీసీ లలో 125 కులాలు ఉన్నాయి.ఇందులోని అన్ని కులాలకు కార్పొరేషన్ లు త్వరలోనే అన్ని 125 కులాలవారికి ఏర్పాటుచేస్తామని చెప్పారు…ఈరోజు…రాజమండ్రి సభలో…

125 బీసీ కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామన్నారు.వీటి ఆర్ధిక పరిది 100 నుంచి 1000 కోట్లు.ఈ 125 కులలలో ఒక్క కులం గవరకులం.

ఇంతవరకు కులానికి ,కులం లోనివారికి తెలియని ఎంతోమంది ,ఇది తమ శ్రమ ఫలితమే అని పబ్లిక్ మాధ్యమాలలో మెసేజులతో హోరెక్కిస్తునారు….

సంతోషమే…..కానీ ….సాధ్యమేనా….నమ్మగలమా…2014 హామీ ఎగిరిపోయింది.మళ్లీ ఎన్నికల సమయం లో అదే చంద్రబాబు ,అదే పార్టీ తరుపున ఇస్తున్న ఈ హామీ సాకారం జరిగెనా…..

రాజకీయ చైతన్యం కలిగిన చదువుకున్న అవగాహన కలిగిన యువత గౌరీయులలో లేక్కకుమించి ఉన్నమాట నిజం.

మనం రాజకీయాలు కు అతీతంగా ఆలోచించే సమయం ఆసన్నమైంది.మనల్ని పదే పదే మోసం చేస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టొద్దు.కులముకి జరిగే మేలు ని స్వాగతీద్దాం….

కానీ నిజాయితీగా ఆలోచిద్దాం..
ఇది….అంటే గవర కుల కార్పొరేషన్ ..సాధ్యమేనా…చంద్రబాబుని నమ్మొచ్చా….నిజాయితీగా స్పందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *