రెండేళ్ల క్రితమే ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు తెలుసు పవన్…

  • 1.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను పాకిస్థాన్ మీడియా వాడేస్తోంది.
  • 2.ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉందన్న ఆయన వ్యాఖ్యలే దీనికి కారణమయ్యాయి.
  • 3.కానీ జరుగుతున్న ప్రచారాన్ని పవన్ ఖండించారు.
  • Pawan Kalyan ను వాడేస్తున్న పాకిస్థాన్..‘పవర్’ క్రేజ్!

భారత్, పాకిస్థాన్ యుద్ధం గురించి పవన్ కళ్యాణ్‌కు ముందే తెలుసా? ఎన్నికల ముందు యుద్ధం రాబోతుందని నాకు ముందే చెప్పారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్‌లోనూ వైరల్ అయ్యాయి.

కడప జిల్లా పర్యటన సందర్భంగా.. ‘రెండేళ్ల క్రితమే ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు చెప్పారు.

మన దేశంలో ఎలాంటి వాతావరణం ఉందో మీకు తెలుసు’ అని పవన్ తెలిపారు. ఆ వీడియోలో పవన్ బీజేపీ పేరును ప్రస్తావించలేదు. కానీ పవన్ కళ్యాణ్‌ను మాత్రం మీడియా వాడేస్తోంది.

నేషనల్ మీడియాతోపాటు.. పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ వెబ్‌సైట్ కూడా పవన్ ఇలా వ్యాఖ్యానించారని ప్రచురించాయి. ‘2019 ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని బీజేపీ నాకు రెండేళ్ల క్రితమే చెప్పింద’ని రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని డాన్ తన లైవ్ బ్లాగ్‌లో రాసుకొచ్చింది.

పూర్తి కథనానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ లింక్‌ను ఎంబెడ్ చేసింది.

‘మన దేశంలో యుద్ధం రాబోతుందని చాలా మందికి ముందే తెలుసు. అంతర్జాతీయ రాజకీయాల గురించి అవగాహన పెంచుకుంటే.. భవిష్యత్తు పరిణామాలను ఊహించొచ్చు. ఇది నా అంచనా కాదు. రాజకీయ విశ్లేషకుల అంచనా మాత్రమే. అంతేగానీ నాకెవరో చెప్పింది కాద’ని పవన్ అని ప్లేటు ఫిరాయించారు ఇపుడు.

కానీ యుద్ధం గురించి బీజేపీ పవన్‌కు ముందే చెప్పిందంటూ.. ఎన్నికల ముందు కమలం పార్టీపై ప్రతిపక్ష పార్టీలు ఎదురు దాడికి దిగుతున్నాయి.

ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ యుద్ధానికి వెళ్తున్నారని ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించగా.. ఇక్కడ బీజేపీ వ్యతిరేకులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed