జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం.. నిమ్మగడ్డ కేసులో కీలక ఆదేశాలు

దీనిపై విచాణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ ఎస్‌ఈసీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై విచాణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది.. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్గు తీర్పు అమలు చేయాలని గవర్నర్‌‌ను కోరాలని చెప్పింది.

అయితే గవర్నర్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నామన్న నిమ్మగడ్డ లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే శుక్రవారం కోర్టు ఎలాంటి సూచనలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *