ఘనంగా గవరపాలెం గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవా రాజ్యాన్ని పురస్కరించుకొని బుధవారం రికార్డు స్థాయిలో సారె ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్సవం ఎంత విశిష్టతను దక్కించుకుందో, ఈ సారి ఊరేగింపు అనేది కూడా అంతే ప్రత్యేకతను గడించుకుంది. మునుపటి సంవత్సరం కంటే కూడా ఈ ఏడాది మరింత గొప్పగా ఊరేగింపు జరిగింది.

గవరపాలెం ప్రాంతంలో పాటుగా, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా తమ తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలను ఈ ఊరేగింపులో ప్రదర్శించారు.

అమ్మవారికి సారి సమర్పించడం అనేది ఏటా వస్తున్న ఆనవాయితీ. ఈ ఊరేగింపుకు స్థానికులు తమ తమ బంధువులను కూడా ఆహ్వానిస్తారు.

వారితో కలిసి ఎంతో నిష్టతో వండిన పిండివంటలను అమ్మవారికి సమర్పించేక్రమంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

సతకంపట్టు నుంచి బయల్దేరిన సారె ఊరేగింపు మునసబు గారి వీధి,చినరామస్వామి కోవెల, విజ్ఞాన సమితి, పెద రామ స్వామి కోవెల, కొణతాల సుబ్రమణ్యం గారి వీధి, గంగరావి చెట్టు, వేగి వీధి , చింత వారి వీధి,  మెయిన్ రోడ్,  గౌరమ్మ గుడి వరకు ఈ సారె సాగింది.

బూరెలు, గారెలు, లడ్డూలు, అరిసెలు, చక్కిలాలు  వంటి సాంప్రదాయ పిండివంటలతో పాటుగా  పలు రకాల తీపి పదార్థాలు ఈ ఊరేగింపులో కనువిందు చేశాయి.

వీటిని మహిళలు ఎంతో భక్తితో తలపై ఉంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ సారె ఊరేగింపు కార్యక్రమం లో ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష అప్పారావు నాయుడు,  కమిటీ ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *