ఏపీలో ఆర్టీసి సమ్మె….. నేడే తేదీ ఖరారు…

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో సమ్మె సైరన్ మోగింది. RTC ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి.

తమ డిమాండ్ మీద అధికారులతో చర్చలు విఫలమవడంతో బుధవారం సమ్మె తేదీని ప్రకటించాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

డిమాండ్ల విషయంలో విజయవాడలో ఆర్టీసీ Md సురేంద్రబాబు, E D లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు పిలుపు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ప్రకటించారు.

ఉద్యోగులకు ఫిట్మెంట్ 50 శాతం ఇవ్వాలని కోరగా యాజమాన్యం 20 శాతం మించి ఇచ్చేది లేదని మొండికేయడంతో ఉద్యోగాలు వ్యతిరేకిస్తున్నారు.

APSRTC లో నష్టాలకు ప్రభుత్వమూతీసుకుంటున్న నిర్ణయమే కారణమని, నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని ఉద్యోగులు చెబుతున్నారు.

ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ జీతభత్యాలతో పని చేస్తున్నప్పటికీ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండి పడుతున్నారు. వేతన సవరణ లో ఉన్న డిమాండ్లను సాధించడం కోసం ఇప్పటికే ఆర్టీసీలో 8 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి.

నేడే సమ్మె తేదీ ప్రకటన

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె తేదీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో చేపట్టబోయే సమ్మె షెడ్యూల్ కూడా ప్రకటించడానికి కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సిబ్బందిని తొలగించే నిర్ణయాలు తీసుకుంటుందని నేతలు ఆరోపిస్తున్నారు.

సివిల్ ఇంజనీర్, సెక్యూరిటీ విభాగాలలో సిబ్బందిని తగ్గించడం, రాయితీలను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు.

ప్రభుత్వం ఫిట్మెంట్ తదితర డిమాండ్ల లో సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *