DATA Theft & AP Politics – ఆంధ్రుల ఓట్లు గల్లంతు

రెండు రోజుల నుంచి ఏ తెలుగు ఛానల్ చూసినా , ఏ పేపర్ తిప్పినా , మనం డేటా చోరీ గురించి చదువుతున్నాం.

అసలు ఏమి చోరీ జరిగింది ?
బాధ్యులెవరు ?
ఎలా చేసారు ?

సులభమైన భాషలో చెప్పటానికి, నా చిన్న ప్రయత్నం.

ఏమి జరిగింది ?

కొన్ని ప్రైవేట్ డేటా అనలిటిక్స్ కంపెనీల సహకారం తో, సర్వే చేయించి, ఎవెరెవరు టీడీపీ కి అనుకూలంగా ఉన్నారో, ప్రతికూలంగా ఉన్నారో తెలుసుకుని , ఒక లిస్ట్ తాయారు చేసి, ఆ లిస్ట్ ని ఎలెక్టోరల్ డేటా తో మ్యాప్ చేసి, టీడీపీ కి ప్రతికూలంగా ఉన్న వారి పేర్లను తీసేసారు ? .

ఇందులో దొంగతనం ఎక్కడుంది ?

ప్రైవేట్ సంస్థలను ప్రభత్వ సేవలకు ఉపయోగించకూడదా ?
ఆధార్ , ఓటర్ లిస్ట్, పాన్ కార్డు – పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కదా ?
నేను చాల చోట్ల నా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ప్రూఫ్ గా ఇచ్చాను ?
చోరీ ఎక్కడ జరింగింది ?

కలర్ ఫోటో ఓటర్ కార్డు .

మీరెప్పుడైనా కలర్ ఫోటో ఓటర్ కార్డు చూసారా ?
ఎవరిదేగ్గరైనా బ్లాక్ & వైట్ ఓటర్ కార్డు మాత్రమే ఉంటుంది.
కలర్ ఫోటో ఓటర్ కార్డు స్టేట్ గవర్నమెంట్ దెగ్గర ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ దెగ్గర ఉంటుంది.

బ్లూ ఫ్రాగ్ & IT గ్రిడ్ దెగ్గరికి కలర్ ఫోటో ఓటర్ కార్డు ఎలా వచ్చింది ?

కేవలం రాష్ట్ర ప్రభుత్వం , ఎలక్షన్ కమిషన్ దెగ్గర ఉండాల్సిన కలర్ ఫోటో ఓటర్ ID కార్డులు , ఈ IT సంస్థలకు ఎవరు ఇచ్చారు ?

ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు అని చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పింది

దొంగతనం జరిగింది

ఇప్పుడు అర్థమైందా దొంగతనం ఎక్కడ జరిగిందో ?
ఎలక్షన్ కమిషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలర్ ఓటర్ కార్డ్స్ ఇవ్వకపోతే , వేళ్ళ దెగ్గరికి ఎలా వచ్చాయి ?
దొంగతనం చేస్తే వచ్చాయి , ఇది జరిగిన దొంగతనం. ఇందుకు కేసు పెట్టారు .

చంద్రబాబుకు ఉలుకెందుకు ?

ఇప్పుడు పోలీస్ అడగాల్సిన ప్రశ్న ఒక్కటే . IT సంస్థలకు కలర్ ఓటర్ కార్డులు ఎవరు ఇచ్చారు ?
ఎలక్షన్ కమిషన్ ఇవ్వక , రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక ? ఎక్కడ నుంచి వచ్చింది ?
చంద్రబాబు ఇచ్చాడా ? లోకేష్ బాబు ఇచ్చాడా ? తెలుగు దేశం పెద్దలు ఇచ్చారా ?

  1. ఈ డేటా చోరీ ఘట్టం లో ఎవరు పాత్రధారులు ?
  2. తెలుగు దేశం పార్టీ.
  3. Data Analytics సంస్థలు – IT Grid & Blue Frog .
  4. జన్మభూమి కమిటీలు
  5. అంగన్వాడీ వర్కర్స్.
  6. Seva Mitra App
  7. ఏంటీ సేవ మిత్ర APP ?

ప్రభుత్వం జరుపుతున్న నానా రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి టీడీపీ వాళ్ళు ప్రవేశ పెట్టిన “Data Gathering Mechanism ” ఈ సేవ మిత్ర.

మీలో చాల మందికి 1100, 1106 నుండి కాల్స్ వచుంటాయి ?

Two Data Sets 😗

Data Set 1 : Information / Feedback from Seva Mitra App.
Data Set 2 : Color Voter ID Cards with booth level information.
ఈ రెండు డేటా ని ఉపయోగించి డేటా అనలిటిక్స్ సంస్థలు ఏమి చేసాయి ?

Blue Frog & IT Grid – వీళ్ళు ఏమి చేసారు ?

పై ట్వీట్ లో చెప్పిన రెండు డేటా సెట్స్ తీస్కుని, Advanced Analytical Software ఉపయోగించి,
ప్రభుత్వానికి ఎవరు ప్రతికూలంగా ఉన్నారు ?

వాడి అడ్రస్, ఓటర్ ID ,ఊరు, వోట్ వేసే బూత్ నెంబర్ ,
ఇవన్నీ తెలుగు దేశం జన్మభూమి కమిటి కి ఇచ్చారు

తెలుగు దేశం జన్మభూమి కమిటీ ఏమి చేసింది ?

ప్రభుత్వానికి ఎవరు ప్రతికూలంగా ఉన్నారన్న లిస్ట్, బూత్ లెవెల్ లో ఉన్న జన్మభూమి కమిటి కి వెళ్లిన తర్వాత. ఈ లిస్ట్ లో ఉన్న ఓటర్లు ని జాబితా నుంచి తొలగించడానికి అంగన్వాడీ వర్కర్స్ ను వాడుకున్నారు.

అంగన్వాడీ వర్కర్స్ ఏమి చేసారు ?

జన్మభూమి కమిటీ నుంచి వచ్చిన లిస్ట్ లో ఉన్న పేర్లను, కనీసం ఫీల్డ్ వర్క్ కూడా చెయ్యకుండా, గుడ్డిగా ఈ ఓటర్లు ఎవ్వరు ఊరిలో లేరనో , కారణం రాసి , వీళ్ళను జాబితా నుంచి తొలగించాలని , “E -Seva ” లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ కి ఇచ్చేసారు .

Field Work అంటే ఏమిటి ? ఇంతకముందు ఎవరు చేసే వాళ్ళు ?

మీకు గుర్తు ఉంటె, పాత రోజుల్లో, ఊరిలో ఉన్న టీచర్లు మన ఇంటికి వచ్చి, మన గురించి అడిగి మరీ ఓటర్ బుక్ లో టిక్ పెట్టుకునే వారు.

ఇప్పుడు ఇదే పని టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ లో చేయిస్తోంది.

అంగన్వాడీ వర్కర్స్ ఎందుకు ఇలా చేసారు ?

వీళ్లకు ఊర్లో కొంచం హవా ఉన్న వాళ్ళు కాంట్రాక్టు వర్క్ ఇప్పిస్తుంటారు. ఇక్కడ జన్మభూమి కమిటి వల్ల వీరికి వచ్చింది. మరి జన్మభూమి కమిటీ చెప్పిన విధంగా వింటే, ఇంకొకసారి కాంట్రాక్టు వర్క్ ఇప్పిస్తారు. అంతే, వాళ్ళు ఏమి చెపితే అది చేసేసారు .

Teacher vs Anganwadi Worker (AW)

  • Teacher – Qualified, AW – Not Qualified.
  • Teacher – Govt Employee, AW – Contract Worker.
  • Teacher – Responsible as he may loose job if anything wrong is done.
  • Teacher – Worked in Election Duty , AW – No Experience in Election duty.

Accountability ఎక్కడ ?

లిస్ట్ ఇచ్చిన వాడు – ప్రైవేట్ సంస్థ
ఫీల్డ్ వర్క్ చేసింది – కాంట్రాక్టు వర్కర్ – అంగన్వాడీ.
డేటా అప్లోడ్ – కాంట్రాక్టు వర్కర్
Influenced by – జన్మభూమి కమిటి

ఎక్కడన్నా ప్రభుత్వం ఉందా ? ఎవడు జవాబుదారీ ?

ఎవరి Votes లేపేశారు ?

వీళ్ళ దెగ్గర కులాల వారీగా, ప్రాంతాల వారీగా డేటా ఉంది. ప్రతి జిల్లాకు ఒకే విధానం అనుసరంచిలేదు.
ఏ కులం ఓట్లు తీసేసారు : రెడ్డి, బ్రాహ్మణ, బీసీ లో కొంత మంది.
ఏ కులం ఓట్లు తక్కువ ముట్టుకున్నారు : కమ్మ, కాపు, బలిజ, sc , st , మైనారిటీస్

ఎక్కడ లేపేశారు ?

పులివెందుల లో ఒక 5000 ఓట్లు తగ్గితే జగన్ కు నష్టమా ?
గాజువాక లో 5000 ఓట్లు తగ్గితే పవన్ కు నష్టమా ?

ఏ కాన్స్టిట్యూఎన్సీ అయితే కొంచం టీడీపీ కి అనుకూలంగా ఉందొ, అక్కడ విల్లు ఓట్లు లేపడానికి ప్రయత్నం చేసారు.

కాన్స్టిట్యూఎన్సీ కి 10,000 ఓట్లు ?

ఒక్క MLA సీట్ కి 10,000 ఓట్లు ఏతేస్తే ఎంత ప్రమాదం ?
2014 లో10,000 కంటే తక్కువ మెజారిటీ తో గెలిచినా MLA లు ఎంత మంది ?
ఇది తెలుగు దేశం పన్నిన కుట్ర.

AP Police or CBN Army ?

ఇంత విషయం తెలుసుకున్న లోకేశ్వర్ రెడ్డి అనే అతను కంప్లైంట్ చేస్తే , అతన్ని అరెస్ట్ చెయ్యడానికి రాత్రికి రాత్రి 200 మంది ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. వీళ్ళు పోలీసుల కంటే సీబిన్ ఆర్మీ లాగ పనిచేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.

ప్రతిపక్షం చేయగలదా ?

కలర్ ఫోటో తో ఉన్న ఓటర్ కార్డు వాళ్ళ దెగ్గరికి ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి, లేక ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ప్రతిపక్షానికి ఈ డేటా దొరకడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రతిపక్షం ఇది చేసే ఛాన్స్ లేదు. ఇది కచ్చితంగా టీడీపీ పని.

Jurisdiction 😗

దొంగతనం చేసిన కంపెనీ హైదరాబాద్ లో ఉంది.
దొంగతనం చేసారు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి హైదరాబాద్ అతను .
ఇంకా, కేసు హైదరాబాద్ లో పెట్టక, కుప్పం లో పెడతారా ?
వినేవాడు ఎర్రిపప్ప అయితే, చెప్పేవాడు చంద్రబాబు అని మరోసారి నిరూపించాడు.

Electoral Data – బాధ్యత ఎవరిది ?

ఒక రాష్ట్రము లో ఎలెక్టోరల్ డేటా అంటే, ఓటర్ల జాబితా సరిగ్గా పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
మన ఆంధ్ర విషయం లో తెలుగుదేశం ప్రభుత్వానిది.

ఎలక్షన్ ముందు ఏమి జరుగుతుంది ?

ఎన్నిక తేదీ అన్నున్స్ చేసాక,
ఎలక్షన్ కోడ్ వచ్చాక,
ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటర్ల జాభితా అడుగుతుంది.

ఎలక్షన్ కమిషన్ నిద్ర పోతాఉందా ?

ఇంత దారుణం, కళ్ళ ముందు జరుగుతుంటే , ఎలక్షన్ కమిషన్ ఏమి చేస్తా ఉంది ? నిద్ర పోత ఉందా ?
ఇది ప్రజాస్వామ్యాన్ని తుంగ లో తొక్కిన వేళ . ఎన్నికల కమిషన్ ఇంకాస్త జాగ్రత్త వహించాలి.

బాధ్యత గల ముఖ్యమంత్రి ఏమి చెయ్యాలి ?

ప్రజలకు భరోసా ఇవ్వాలి.
IT గ్రిడ్ & Blue Frog సంస్థలను బ్లాక్ లిస్ట్ చెయ్యాలి.
తక్షణమే రెండు సంస్థలతో ఉన్న కాంట్రాక్టులు రద్దు చెయ్యాలి.
అన్ని విధాలా తెలంగాణ పోలిసిలకు సహకరించాలి.

  1. మన చంద్రబాబు ఏమి చేస్తున్నాడు ?
  2. మోడీ ని తిడుతున్నాడు.
  3. జగన్ ని తిడుతున్నాడు.
  4. కెసిఆర్ ని తిడుతున్నాడు.
  5. దొంగ పని చేసిన సంస్థలను సమర్థిస్తున్నాడు.
  6. కచ్చితంగా తప్పు జరిగింది 😗

చంద్రబాబు గారి ప్రభుత్వం కచ్చితంగా తప్పు చేసింది, ఇది చంద్ర బాబుకు తెలుసు, అసలు IT సంస్థలకు కలర్ ఓటర్ కార్డులు, ప్రభుత్వం ఇవ్వక, ఎలక్షన్ కమిషన్ ఇవ్వక , ఎవరు ఇచ్చినట్టు , ఇది చిన్న విషయం కాదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహం.

Conclusion 😗

వోట్ హక్కకు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చే శక్తి. దాన్ని హరించాలి అని చూడటం మహా నేరం. రాజ్యాంగం కంటే గొప్పదా తెలుగు దేశం పార్టీ ?

ఒక ఆంధ్రుడు , తనకు నచ్చిన వాడికి వోట్ వేసే స్వాతంత్రం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *