జగన్గారు హోదాను పట్టించుకోవడం లేదు అన్న నాయకులకు!

  1. ప్రధాని మోడీ అధ్యక్షతన అందరు CM లు పాల్గొన్న నీతి ఆయోగ్ సమావేశం లో మోడీ సమక్షం లో CM జగన్ గారు హోదా కావాలి అని గట్టిగా అడిగారు.
  2. 2.తరువాత అసెంబ్లీ సమావేశం లో హోదా కావాలి అని తీర్మానం చేసి పంపారు
  3. 3.నిన్న అంటే Aug 6 ,2019 న మోడీ ని కలిసినప్పుడు కూడా హోదా కావాలి అనే అడిగాడు

ఎన్నికలకు ముందు కేంద్రం లో ఏ పార్టీ కి పూర్తి మెజారిటీ రాక , ప్రభుత్వ ఏర్పాటుకు మా YCP MP ల మద్దతు అవసరం అయి, కావాలి అని అడిగితె అప్పుడు హోదా ఇస్తే మద్దతు ఇస్తాము అని జగన్ చెప్పాడు కానీ అక్కడ మోడీ కి 300 పైగా MP సీట్లు వచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పడింది.

పైగా బాబు సీఎం అయినాక కొత్తగా ఈ ఐదేళ్లలో 2 లక్షల 50 వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల గుల్ల చేసాడు కాబట్టి కేంద్ర సహాయసహకారాలు అవసరం .

మరి ఈ పరిస్థితుల్లో అడగడం తప్పించి చేయగలిగేదేముంది?

2014 ఎన్నికల్లో బాబు మోడీ పవన్ కలిసి పోరాడారు కాబట్టి బాబు కానీ పవన్ కానీ మోడీని అడిగి తీసుకొస్తే కాదన్నది ఎవరు?

Note: జగన్ గారు ఏనాడు హోదా వద్దు అనలేదు కానీ యూ టర్న్ బాబు అన్నాడు
రెండు పాచి పోయిన లడ్లు ఇచ్చారు అన్న పవన్ కూడా ఏమీ మాట్లాడం లేదు

ఒకవేళ మోడీ హోదా ఇవ్వకపోతే ఇవ్వడం లేదు కాబట్టి ప్యాకేజి తీసుకొంటున్నాను అని బాబు అంటే కొంతవరకు అర్ధం ఉండేది కానీ హోదా ఏమైనా సంజీవనా ? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగు పడ్డాయి? హోదా లాభాలేంటో నాకు ట్యూషన్ చెప్పండి, హోదా అంటే జైలుకే , నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాకు అంతా తెలుసు జగన్ గారు ఏమీ తెలీయదు అని అనకుండా మోడీకి పూర్తి మెజారిటీ ఉంది కాబటి అడగడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని ఉంటె కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు

మరల ఎన్నికలకు ముందు హోదా కావాలి అని బాబు అడగడం ఇంకో తప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *