కరకట్టకు పొంచిఉన్న పెను ముప్పు

నదులను ఆనుకుని ఎలాంటి పటిష్టమైన నిర్మాణాలను చేపట్టరాదని చట్టాలు ఉన్నప్పటికీ, చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకునే దగుల్బాజీ నేతల దర్పాల ముందు చట్టాలు తలదించుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులం అని డప్పు కొట్టుకునే సామాజికవేత్తలు, ప్రకృతిరక్షకులు నాయకుల చట్టోల్లంఘనను ఏమీ చేయలేక చచ్చిన పీనుగుల్లా పడిఉంటున్నారు.
ఇక మేధాపాట్కర్, అన్నా హజారే లాంటి మహా మేధావులు గాడిదలు, గుర్రాలకు పళ్ళుతోముతూ కాలక్షేపం చేస్తుంటారు. సామాన్యుడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతికి వ్యతిరేకంగా చిన్న గోడ కట్టుకున్నా, వెంటనే మునిసిపాలిటీవారు రంగంలోకి దూకి జేసీబీలు తెచ్చి క్షణాల్లో కూల్చిపారేస్తారు. కోర్టులు కూడా వారిపట్ల సానుకూలంగా ప్రవర్తించవు.
కానీ, ఘరానా మనుషులు చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించి ఎకరాలకొద్దీ స్థలాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో విలాసమందిరాలు నిర్మించుకుని కోట్ల రూపాయలను ఆర్జిస్తుంటే ఒక్క వ్యవస్థ కూడా అది తప్పు అని హెచ్చరించలేదు. ఫలితంగా కరకట్ట మీద వందలాది బహుళ అంతస్తుల భవనాలు వెలిసి పర్యావరణ చట్టాలను అపహాస్యం చేశాయి.
దీనికి ప్రభుత్వం తో పాటు న్యాయస్థానాలు కూడా ముద్దాయిలే. అక్రమ కట్టడాలను నిర్మూలించిన ప్రభుత్వాలు ఆక్రమణదారుల వద్ద ముడుపులు మింగి మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడమైన లింగమనేని అతిథిగృహం లో కుటుంబంతో సహా కాపురం పెట్టడం, అంతటితో ఆగకుండా మరో ప్రజావేదిక పేరుతొ మరో అక్రమ కట్టడాన్ని నిర్మించడం ముమ్మాటికీ గర్హనీయం. చంద్రబాబు అందుకు శిక్షార్హుడు.
చంద్రబాబు మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి. గత పదేళ్లుగా వానలు వరదలు లేకపోవడంతో నదుల ఉగ్రస్వరూపాన్ని చూసే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు కలగలేదు. కానీ, మొన్న ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు వరదల రూపం దాల్చి కృష్ణమ్మ ఉగ్రరూపం ఏమిటో చూసే అవకాశం కలిగింది.
చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడం పాదాల చెంతకు వరదనీరు చేరింది. వరద ఇంకా పెరిగితే భవనం కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కాబోలు చంద్రబాబు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రాత్రికిరాత్రే కరకట్ట నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు పారిపోయాడు. ఆయనకంటే హైదరాబాద్ లో మూడు వందలకోట్ల రూపాయల మహారాజభవనం ఉన్నది.
మిగిలిన వారి సంగతేమిటి? ఆ అక్రమ కట్టడం చుట్టూ ఇసుకబస్తాలను అడ్డుగా పెట్టారు అధికారులు. ఆయన కాన్వాయ్ మొత్తాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారట. చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలి తన నిర్వాకానికి.
ఇకనైనా ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా కరకట్ట మీద కట్టిన నిర్మాణాలన్నింటిని కూల్చేపారేయాలి. ఎవరేమనుకున్నా సరే, చలించక, వెనకడుగు వేయక నదీప్రవాహాన్ని అడ్డుకుంటున్న అన్ని నిర్మాణాలను తక్షణమే తొలగించాలి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనమంతా నదిలో కలిసిపోతామని గుర్తుంచుకోవాలి.