పాక్ నుంచి విడిపోతాం.. సాయం కావాలి: భారత్ మాతాకీ జై అంటూ బలూచిస్తాన్ నాయకుల నినాదాలు

పాకిస్తాన్ నుంచి విడిపోయేందుకు తాము చేస్తున్న పోరాటానికి భారత్ సాయం కావాలని బలూచిస్తాన్ ఉద్యమకారులు కోరారు. ఇవాళ(ఆగస్టు-15,2019) భారతదేశం 73వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలు జైహింద్,భారత్ మాతాకీ జై అని నినదించారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్ర్యం కావాలని, అందుకు మద్దతివ్వాలని భారత్ ను కోరారు. పాక్ ఆధిపత్యం నుంచి, ఆ దేశ సైన్యం నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరారు.

బలూచిస్తాన్ ఉద్యమకారుడు అట్టా బలూచ్ మాట్లాడుతూ…భారతీయ సోదరులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సగర్వంగా ఉన్నారు. వారి సంఘీభావం, సహాయాలకు ధన్యవాదాలని తెలిపారు. స్వతంత్ర బలూచిస్తాన్ కు భారతీయుల గళాన్ని అన్ని వేదికలపైనా వినిపించాలని కోరారు. తమకు భారత్ మద్దతు కావాలన్నారు.

ఐక్యరాజ్యసమితితో సహా అన్ని వేదికలపై భారత్ అధికారికంగా బలూచిస్తాన్ ఇష్యూని ప్రస్తావించాలని మరో బలూచ్ కార్యకర్త అష్రఫ్ షెర్జన్ కోరారు. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్, దాని సైనికుల చేతిలో మారణహోమానికి గురవుతున్నారని, బలూచిస్తాన్ కి రక్తస్రావం అవుతుందన్నారు. వాయిస్ లేని వాళ్లకు వాయిస్ ఇవ్వాలని తాను భారత్ ను అర్జిస్తున్నానని షెర్జన్ అన్నారు.

ఇదిలావుండగా, భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా గుర్తించాలని పాకిస్తాన్ నిర్ణయించగా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా నాయకులు సోషల్ మీడియాలో బ్లాక్ ప్రొఫైల్ చిత్రాన్ని ఉంచారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేయడంపై పాకిస్తాన్ నాయకులు నిద్రపోని రాత్రులు గడుపుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *