మోడీకి… అసదుద్దీన్ కి బాబు లింకులు మోదీ పావులే ‘పవన్’, ‘జగన్’ అంటునా బాబు..

బాబుది రాజకీయంలో పచ్చి అవకాశవాది రాజకీయం తన అవసరం కొద్దీ ఏమైనా మాట్లాడగలడు.. తన ప్రయోజనాల కోసం ఎవరి మీద ఎలాంటి ముద్ర అయినా వేయగలడు.. తాజాగా తన పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.

యథా రీతిని మోడీ మీద దుమ్మెత్తి పోశాడు. గత నాలుగేళ్లలో మోడీని తన బుజలమేద మోసి ఈరోజున మోడీ నీ విమర్శితే ప్రయోజనం ఎమిటి? చంద్రబాబు నాయుడు ఎలా ప్రశంసించాడనే ఉపోద్ఘాతం ఇక్కడ అవసరం లేదు.. అయితే ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు దొసిగా చూపిస్తున్నాడు. అయితే మోడీ ని ఎంత తిట్టినా టీడీపీకి దక్కేది ఏమీ లేదు కదా? ఎందుకంటే ఏపీలో బీజేపీ సున్నా. కాబట్టి అలాంటి పార్టీ మీద యుద్ధం చేసి బాబు సాధించేది ఏమీ లేదు. అందుకే జగని, పవని, మోడీ మనుషులు అంటూ చంద్రబాబు చెబుతునాడు.

ఇక ఇలాంటి కాకమ్మ కథలు చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు. మొన్నటివరకు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించి. ఇప్పుడు కేసీఆర్ కూడా మోడీ మనిషే అని ప్రచారం చేస్తున్నారు అంటే కాకుండా జగన్, పవన్, విరు కూడా మోడీ అనుచరులే అనీ బాకాలు ఊదుచున్న చంద్రబాబు నాయుడు ఎన్ని బాకాలు ఊదినా ప్రజలు గ్రహిస్తున్నారని సంగతి చంద్రబాబు నాయుడు మరచి పోతున్నారు.

అంతటితో ఆగితే చంద్రబాబు ఎందుకవుతాడు! అందుకే ఈసారి ఒవైసీని కూడా కలిపేశాడు జగన్ కు ఒవైసీపీకి స్నేహం ఎక్కడిది? వాళ్ళిద్దరికీ మోడీ దోస్తీ కలిపాడా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు! అంతే.. అంతే.. ఎవరైతే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతారో.. వాళ్లంతా మోడీ మనుషులే! వాళ్లంతా ఏపీపై కుట్ర పన్నినట్టే! ఇదీ చంద్రబాబు మాట. ఇక సోనియా గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. గత ఎన్నికల ముందే మోడీ ప్రత్యేక హోదా హామీని ఇస్తానని అన్నాడని చంద్రబాబు ఏపీ జనాల చెవుల్లో పూలు పెట్టాడు. ఇక ఇప్పుడు సోనియా గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందని చెబుతున్నాడు. కొత్త దేవుడు వచ్చినట్టు అన్న మాట. ఇక ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ మాట మీద నిలబడతాడా లేదా అని బాబు విమర్శించారు. అయినా బాబుకు ఆత్మసాక్షి అంటూ ఒకటి ఉందా?

అది ఉంటే ఇలా మాట్లాడతాడా? ప్రత్యేక హోదా విషయంలో తను ఎన్ని రకాలుగా మాట్లాడాడో… చంద్రబాబు మర్చిపోయాడా? ఆ విషయాన్ని జనాలు మరచిపోయారని అనుకుంటున్నాడా? హోదా విషయంలో కేసీఆర్ ను నిందిస్తూన్న చంద్రబాబు.. తన విషయలను జనాలు గమనించడం లేదుని అనుకుంటుంటే అంతకు మించిన మోసకారి తనం మరోటి ఉండదు.

ప్రతిసారి ప్రతి నాయకుడిని విమర్శిస్తున్న చంద్రబాబు తాను నాలుగున్నర సంవత్సరాల పాలనలో తను ఏమి సాధించాడు అనేది తన ఆలోచించడం లేదు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *