తెలంగాణా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వివిధ పార్టీల నాయకుల నోట వినిపిస్తున్న సినీ గీతాలు!

అంతా భ్రాంతియేనా
జీవితానా వెలుగింతేనా!
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా!

 • చంద్రబాబు

కల చెదిరింది కథ మారింది!
కన్నీరే ఇక మిగిలింది…!
కన్నీరే ఇక మిగిలింది!

 • ఉత్తమకుమార్ రెడ్డి

చిలుకా ఏ తోడు లేక
ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావె
ఎడారంటి ఆశల వెనక!
– కోదండరామ్

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
– రేవంత్ రెడ్డి

ఒంటరినైపోయాను
ఇక ఇంటికి ఏమని పోనూ
– తెలంగాణ బిజెపి.

ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమై పోయిందీ
౼ సిపిఐ

అమ్మతో చెప్పి నేను అప్పచ్చులే తెచ్చుకుంటా అప్పచ్చులే తెచ్చుకుంటా రాహుల్ గాంధీ

కర్మణ్యే వాధికారస్తే తెలంగాణామే…మే…మే…
-నందమూరి బాలకృష్ణ

జోరుగా హుషారుగా షికారు పోదమా హాయిహాయిగా తీయతీయగా

 • కెసియార్

కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి
– హరీష్‌రావు

చెట్టులెక్కగలనే!
ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!

 • కెటియార్

బాషా చూడు బాషా చూడు
ఉక్కువంటి గుండె చూడు లోకం వెంట వచ్చెను చూడరా

 • కెసియార్ గురించి టిఆర్‌ఎస్ శ్రేణులు

నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు
అది మీరే మీరే మాస్టారు
మా దేవుడు మీరే మాస్టారు
– కెసియార్ తో ఓవైసీ

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా

 • బాలకృష్ణతో కూకట్‌పల్లి ప్రజలు

అంతన్నాడింతన్నాడే…
గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు!

 • చంద్రబాబు గురించి తెలంగాణ ప్రజానీకం

సోగ్గాడే చిన్ని నాయనా
ఒక్క పిట్టనైన కొట్టలేని సోగ్గాడే సోగ్గాడు
– కోదండరామ్ గురించి జనం

సరేలే ఊరుకో….
పరేషాన్ ఎందుకో ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా!

 • రాహుల్ గాంధీతో చత్తీస్ గఢ్, రాజస్థాన్ ఫలితాలు

కలవరమాయె మదిలో…
నా మదిలో…
– రాబోయే ఆంధ్రా ఎన్నికలు గుర్తొచ్చిన చంద్రబాబు

ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న

 • కెసియార్ తో కెటియార్

ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా

 • కెటియార్ తో కెసియార్

మామయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
_ కెసియార్‌తో హరీశ్ రావు

నీ పాపం పండెను నేడు
నీ భరతం పడతా చూడు
నీ పాలిట యముణ్ణి నేను
నీ కరక్టు మొగుణ్ణి నేను
– ఆంధ్రజ్యోతి ఆర్కేతో KCR

పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
– కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు

ముందు తెలిసెనా ప్రభూ,
ఈ మందిరమిటులుంచేనా
_ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ పార్టీ నుండి బయటకు దూకేసిన నాయకులు

పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు

 • టిఆర్‌ఎస్ బహిష్కరించిన నాయకులు

నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో….

 • లగడపాటి

ఫైనల్ గా మహాకూటమి నాయకులంతా కలిసి పాడుకునే పాట:
”ముత్యాల చెమ్మచెక్క! రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా
ఆడుదుమా కలకల కిలకిల నవ్వులతోగాజులు గలగలలాడ….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *