అరకులోయలో అట్టహాసంగా మొదలైన బెలూన్ ఫెస్టివల్ పాల్గొన్న 15 దేశాలు

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో సరికొత్త అందలు ఆవిష్కృతమయ్యాయి. నీలి మేఘాల మధ్య రంగురంగుల బెలూన్ల సందడి చేశాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అరకులోయలో మూడు రోజులు బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో ఉదయం 10 గంటలకు హాట్ ఎయిర్ బెలూన్ లను గాలిలో ఎగురవేస్తారు. పదిహేను దేశాలనుంచి వచ్చిన పైలెట్లు సందర్శకుల కేరింతల నడుమ ఒకరి తర్వాత ఒకరిగా తమ బెలూన్లతో గాల్లోకి ఎగిరి.

అరకులోయకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రావడంతో పాటు దేశ విదేశాల పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ ఫెస్టివల్లో నిర్వహించామని చెప్పారు. తరలివచ్చిన సందర్శకులతో కోలాహలం నెలకొంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పోటాపోటీగా బెలూన్లు ఎగురవేశారు.

సగటున 1300 మీటర్ల నుంచి 1500 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి చూపరులను ఆకట్టుకున్నాయి. బేబీ కార్న్, తేనెటీగ, గుడ్డు, జోకర్ గాలి గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎగురుతున్న వాటి మధ్య వైవిధ్యం గా కనిపించాయి. ఐటిడిఎ పిఓ బాలాజీ, పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాన్సు శుక్ల ఫెస్టివల్ ను ప్రారంభించి బెలూన్లో విహరించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మంత్రులు కుటుంబ సభ్యులతో శ్రావణ్ కుమార్ , అఖిల ప్రియ కుటుంబ సభ్యులతో వేరువేరు బెలూన్ లలో విహరించారు.

బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అరకు లోయ ప్రాంతం అనుకూలంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బెలూన్ ఫెస్టివల్ కు హాజరైన విదేశీయుల బస కేంద్రాలను ఆమె సందర్శించారు, విదేశీయుల తో కలిసి ఆమె భోజనం చేశారు. అరకు అందాలు విదేశీయులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి దేశంలోనే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అరకు వేదిక కావడం ఆనందంగా ఉందని అన్నారు పర్యాటకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *