ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎంతో సీఎస్ సీన్ హైలెట్!
ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నవ్వుతూ పలకరించుకోవడం ఆసక్తి కలిగించింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, సైక్లోన్ ఫణి వల్ల తలెత్తిన నష్టం, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పనులపై చర్చించారు.

దాదాపు రెండు గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది.

ఉపాధి హామీ పథకం అమల్లో ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలవడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై ఆయన ప్రశంసలు గుప్పించారు.

కేబినేట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కూడా హాజరయ్యారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం చంద్రబాబు మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

కానీ కేబినెట్ భేటీలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకోవడం ఆసక్తికరం.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పునేఠా స్థానంలో ఈసీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయం పట్ల చంద్రబాబు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ పదవిని చేపట్టిన నాటి నుంచి సీఎం, సీఎస్ మధ్య సంబంధాలు అంతగా లేవు.

బాబు ఆపద్ధర్మ సీఎం అని పదే పదే ప్రస్తావించిన సీఎస్.. కేబినెట్ భేటీకి కూడా అడ్డు తగిలారు.

మంత్రివర్గ సమావేశ అజెండాను భేటీకి 48 గంటల ముందే ఈసీకి పంపి అనుమతి తీసుకోవాలని సూచించారు. దీంతో మే 10న జరగాల్సిన సమావేశం మంగళవారం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *