ఫలితాల తర్వాత వైసీపీ అధినేత ఫ్యాన్ వాడటం మానేస్తారు.. టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. మరో పది రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

టీడీపీ, వైసీపీల పరస్పర విమర్శలతో రాజకీయాలు మరింత వేడెక్కడాయి. తాజాగా, వైసీపీ అధినేత జగన్‌, విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో గెలిచేశామనే భ్రమల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఊగిసలాడుతున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, జగన్ తోక ముడిచారని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ పులిగా మారారని దుయ్యబట్టారు. జగన్ తన అవినీతి కేసుల నుంచి బయట పడేందుకే మోదీ కాళ్లపై పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.

ఆ కారణంతోనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తు వేగవంతంగా జరగకుండా ప్రధాని మోకాలడ్డుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

దేశంలో అవినీతిని ఏరివేస్తానని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ.. జగన్‌లాంటి అవినీతి పరులకు అండగా ఉండటం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు.

అంతేకాదు, ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఫ్యాన్ వాడటమే మానేస్తారని బుద్దా వెంకన్న వ్యంగ్యంగా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *