అనంతపురం సమర శంఖారావం సభలో చంద్రబాబు నాయుడు పై ధ్వజమెత్తిన జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ సిపి అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని నాన్న హoగామ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడలేని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కారు అన్నారు.

2014 ఎన్నికల్లో ఇచ్చిన 119 హామీలను గాలికి వదిలేశారు అన్నారు. వ్యవసాయ రుణాల మాఫీ చేయాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, బ్యాంకు లో పెట్టిన బంగారం బయటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి.

రైతుకు గిట్టుబాటు ధర కావాలంటే బాబు సీఎం కావాలి ,ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచే సార్ అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బాబు కావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసుకున్నారు.

ఒక వేల ఉద్యోగాలు ఇక్కడ లేకపోతే నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని రెండు వేలు చూపించి ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని ధ్వజమెత్తారు.

తీరా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా సగం అంటే నెలకు వెయ్యి ఇస్తున్నారని విరుచుకుపడ్డారు విరుచుకుపడ్డారు.

అలాగే నాలుగున్నరేళ్లు బీజేపీ, పవన్ కళ్యాణ్ తో సంసారం చేసిన చంద్రబాబు నాయుడు సరిగ్గా ఎన్నికలు వస్తున్నాయని ఆరు నెలల ముందు గుర్తుకు వచ్చింది అన్నారు.

అంతకుముందు ప్రత్యేక హోదా సంజీవి నా ప్రత్యేక హోదా కంటే ఎక్కువ చేశారు హోదా కోసం ఉద్యమాలు చేసే వారిని జైల్లో పెట్టండి అని అన్నారు.

ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారని విరుచుపడ్డారు. నల్ల చోక్కలు వేసుకుని రోజుకో డ్రామా ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.

చిలక గోరింక లు అసూయపడేలా నాలుగున్నరేళ్లు మోడీ తో కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోడీ పై విరుచుకు పడుతున్నారు.

నాలుగున్నరేళ్లు అవ్వ, తాత లను పట్టించుకోని చంద్రబాబు సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి వారు గుర్తుకు వచ్చారు అంటూ నిలదీశారు.

రైతులకు ఏడాది కి12 వేల 500 చొప్పున 5 ఏళ్లలో 50000 చెల్లిస్తానని వైసిపి ఇచ్చిన హామీని చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు.

ఇప్పటికీ రైతు రుణమాఫీ ని పూర్తి చేయని చంద్రబాబు నాయుడు సుఖీభవ అంటూ మరో పథకాన్ని తెస్తున్నారని విరుచుకుపడ్డారు.

చంద్రబాబు హమీలు చూస్తుంటే కొత్త సినిమా వాల్పోస్టర్ మాదిరిగా ఉన్నాయ్ అని వైఎస్ జగన్ అన్నారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *