ఎన్నికలు దగ్గరపడుతున్న వేళలో

రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడండి. వ్యక్తిగతంగా చూడకండి. ఎందుకంటే ఎలక్షన్ లో గెలిచిన వారు పదవిలో ఉంటారు. మన అందరం ఒకే ఊరిలో ఉండే వాళ్ళం.

పొద్దున్న లేవగానే రాత్రి వరకు కలిసి కలిసి తిరగాలి, పని చేయాలి, ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల వల్ల ప్రేమాభిమానాల తో బాబాయి మామా తమ్ముడు అని పిలుచుకునే బంధాల మధ్య కొలిమి రాజేస్తున్నారు.

యువకుల మధ్య అల్లరులు గొడవలు పెట్టేవి ఈ ఎలక్షన్స్ మాత్రమే. అందుకే ఆలోచించండి. యువతను రాజకీయాలకు వాడుకోకండి. మందు,డబ్బు వాటికి అమ్ముడు పోకండి.

విజ్ఞతతో ఆలోచించండి. ఎన్నికలలో పోటీ పడే వాళ్ళు, గెలిచినవారు, ప్రతిపక్ష నాయకులు అందరూ మిత్రులవుతారు కానీ వారి వెంబడి తిరిగే మనం మాత్రం ఒకరికొకరం శత్రువులు గా మిగిలిపోతున్నాము.

అందుకే అందరూ ఆలోచించండి ఈ సమాజంలో యువతరం మనందరిది ……విజ్ఞతగా ఆలోచిద్దాం….బావి రాజకేయాలను పార్టీలకు అతీతంగా స్వాగతీద్దాం…
ఇప్పుడిప్పుడు రాజకీయాలు మాటాడుతున్న యువతని చుస్తే ముచ్చటేస్తుంది

కానీ మీకోక విషయం గుర్తుచేస్తున్నాను…

చంద్రబాబు పాలన లో భూగర్భజలాలు కోసం జనాలు వెతుక్కునేవారు….

అటువంటి దైన్యమైన ఆంధ్రా రాజకీయ ముఖచిత్రం పై అనుకోని అతిధిలా…

ఆధ్యంతం ఒక అద్భుతం లా మెరిసిన మెరుపే….వైస్సార్…

ప్రకృతి సైతం పరవశించి నెలతల్లిని ముద్దాడి…తన మానస పుత్రుడు వైస్సార్ ని హరితాంధ్రప్రదేస్ వైపు తొలియడుగు వేయించిన పరవసాల తల్లి…మన గుంభన ఆనంద ఆంధ్రా ఒడి…

పాతుకుపోయిన ,కూలిపోయిన ,జవసత్వాలు ఉడిగిపోయిన ,నిస్తేజమైన ఆంధ్ర రాజకీయాన్ని చేయితిరిగిన చిత్రకారుడిలా తనదైన ప్రత్యేక శైలిలో మనసా వాచా కర్మేనా వైస్సార్ గీసిన గీతలు అపురూప చిత్రాలై ఆంధ్రుల ఎదలో చల్లని వింజామర వీచికలకు ఆహ్వానం పలికాయి….

మా ఆంధ్రులతో గడిపిన వైస్సార్ జీవనయాత్రలో ,ఆయన స్వరపరిచిన ఋతురాగాల సవ్వడిలో ప్రతికూల ధ్వనిలేని అనంత తరంగాల సాక్షిగా మాలో లీనమైన మహానుభావుడు మన

ఎలుగంటి సందటి రాజశేఖరుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *