3 కాదు, ప్రతి జిల్లాను రాజధానిగా చేయాలి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

సోము వీర్రాజుఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు సంబంధించి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి తీవ్ర వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి సహా బీజేపీ కీలక నేతలు అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ తరుణంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు మూడు రాజధానులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సోము వీర్రాజు ఓ మీడియా చానెల్లో మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలసీ వికేంద్రీకరణే అని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 3, 4 రాజధానులు కాదు.. ప్రతి జిల్లాను ఒక రాజధాని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే హైదరాబాద్‌లో కలిసి ఉన్న సమయంలో మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాబట్టి ప్రతి జిల్లాను రాజధానిగా చేసి 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ వైఖరి అని తెలిపారు.

అయితే రాజధాని అమరావతికి సంబంధించి గతంలోనే చెప్పామని సోము వీర్రాజు చెప్పారు. అక్కడే రాజధాని ఉండాలని, రైతులకు న్యాయం చేయాలని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టం కూడా అమరావతిలోనే ఉండాలని.. అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడే ఉండాలనేది బీజేపీ ఆలోచన అని, దీనికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే రాయలసీమలో హైకోర్టు పెట్టాలని కేంద్రానికి కూడా చెప్పామని, హైకోర్టు రాయలసీమలో ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *