ఆమెకు మరో 3 నెలలు ఛాన్స్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ!

ఆమెను మరో ఆరునెలలు కొనసాగించాలని అప్పట్లో కోరారు.. కేంద్రం మాత్రం మూడు నెలలే పొడిగించింది.

ఈ పదవీకాలం కూడా సెప్టెంబరుతో ముగుస్తుంది. ఆమె పదవీ కాలాన్ని మరో 3 నెలలు సీఎ్‌సగా కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది.

జగన్ సర్కార్ కేంద్రానికి మరో లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.

జూన్‌ 30న నీలం రిటైరయ్యారు. ఆమెను సీఎ్‌సగా మరో ఆరునెలలు కొనసాగించాలని అప్పట్లో కోరారు.. కేంద్రం మాత్రం మూడు నెలలే పొడిగించింది.

ఈ పదవీకాలం కూడా సెప్టెంబరుతో ముగుస్తుంది. ఆమె పదవీ కాలాన్ని మరో 3 నెలలు సీఎ్‌సగా కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది.

గతేడాది నవంబర్ 13న నీలం సాహ్నిని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి ఏపీ సీఎస్‌గా భాద్యతల చేపట్టారు. కాగా, అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది.

ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ప్రసాద్ తాత్కాలికంగా భాద్యతలు అప్పగించారు. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు.

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు.

ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు.

ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు.

జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30వ వరకు నీలం సాహ్ని పదవికాలాన్ని కేంద్రం పొడిగించింది. ఇప్పుడు మరో లేఖ కూడా రాశారు.. కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *