మంత్రి కన్నబాబు రూ. 29 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి కురసాల కన్నబాబు రూ. 29 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్‌ 2020- 21ను ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

గత కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.

దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ.. రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారన్నారు.

రైతుల కోసం నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు ఆచరణలో చూపుతున్నారని చెప్పారు.

ఒత్తిడిలేని వ్యవసాయమే సీఎం జగన్ సంకల్పమని మంత్రి కన్నబాబు చెప్పారు.

పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికర ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడటమే లక్ష్యంగా జగన్‌ సర్కార్ ముందుకెళ్తోందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020- 21 ఏడాదికి గాను రూ. 29,159.97 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదిస్తున్నామని అన్నారు.

రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 12,500 ఇస్తామని చెప్పి రూ.13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు..
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కి రూ. 4,450 కోట్లు
వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ. 6,270 కోట్లు
రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
రైతు భరోసా కేంద్రాలకు రూ. 100 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ. 500 కోట్లు
వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలను రూ. 1,100 కోట్లు
రైతులకు ఎక్స్ గ్రేషియాకు రూ. 20 కోట్లు
రాయితీ విత్తనాల కోసం రూ. 200 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ కు రూ. 207.83 కోట్లు
ప్రకృతి వ్యవసాయానికి రూ. 225.51 కోట్లు
ప్రకృతి విపత్తు నిధి రూ. 2,000 కోట్లు
ఎన్జీ రంగా యూనివర్సిటీకి రూ. 402 కోట్లు
ఉద్యాన వన అభివృద్ధి కి రూ. 653.02 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కి రూ. 88.60 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ. 92.18 కోట్లు
పశు సంవర్థక శాఖకు రూ. 854.77 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ.122.73 కోట్లు
మత్స్య అభివృద్ధికి రూ. 299.27 కోట్లు
సహకార శాఖ కు రూ. 248.38 కోట్లు
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ. 4,450 కోట్లు
వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ. 6270 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ. 122.73 కోట్లు
మత్స్య అభివృద్ధికి రూ. 299.27 కోట్లు
సహకార శాఖకు రూ. 248.38 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *