మూడు రాజధానులపై మరో ముందడుగు పడింది…అసెంబ్లీలో కీలక బిల్లుల ఆమోదం

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించారు. మూడు రాజధానులపై మరో ముందడుగు పడింది.

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు మంగళవారం శాసనసభ ఆమోదం తెలిపింది.

వీటితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సైతం అసెంబ్లీ ఆమోదించింది.

స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.

సాధారణంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెండు, మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ, పద్దుల ఆమోదం వంటివి ఉంటాయి.

అయితే ప్రస్తుత కరోనా సమయంలో త్వరగా సభను ముగించాలనే ఉద్దేశంతో ఉన్న జగన్ సర్కార్ ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టి.. అదే రోజు ఇతర బిల్లులను సైతం ఆమోదింపజేసింది.

ఇదిలాఉంటే.. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చొరవతోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందన్నారు.

అలాగే చట్టంలో సన్నిధి గొల్లల స్థానంలో సన్నిధి యాదవులని పేరు మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *