అమరావతి నిజనిజలపై – ఓ ఆంధ్రుడి ఆలోచనకు అక్షరరూపం!

రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి జరిగిన పరిణామాలపై…
కొత్త రాజధాని పేరుతో గత ఐదేళ్లుగా జరిగిన అక్రమాలపై…
విభజన తరువాత వచ్చిన పాలకుల అశ్రిత పక్షపాతంపై
స్వార్ధ రాజకీయాల కోసం ప్రజాసంక్షేమాన్ని వదిలివేసిన పార్టీలపై…
ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్న మీడియా వైఖరిపై…
జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలపై…
సమగ్ర అభివవృద్దికోసం కొత్త ప్రభుత్వం చేస్తున్న సాహసంపై ….
ఓ ఆంధ్రుడి ఆలోచనకు అక్షరరూపం….

మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆది నుంచి నిరాదరణకు గురవుతూనే ఉంది. హైదరాబాద్‌ రాష్ట్రంతో కలిసి కర్నూలును రాజధానిగా కోల్పోయింది. తరువాతి కాలంలోనూ.. హైదరాబాద్ చుట్టుపక్కలే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. వందల ఏళ్లుగా నవాలు అభివృద్ధి చేసిన నగరంలోనే మళ్లీ డెవలప్‌మెంట్‌ జరిగింది. కేంద్ర సంస్థలు, రాష్ట్ర కార్యాలయాలు… తరువాత కాలంలో సాఫ్ట్‌వేర్ నుంచి మల్టీనేషనల కంపెనీలు ఇలా అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే సాగింది.

ఉత్తరాంధ్ర రాయలసీమలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు. కరువుతో రాయలసీమ, వలసలతో ఉత్తరాంధ్ర మరింత వెనకబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ మినహా మరో నగరం అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధికి ఎక్కడా అవకాశాలు కల్పించబడలేదు. అందుకే రాష్ట్రం విడిపోయింది. మళ్లీ రాజధాని కోసం ఆంద్రప్రదేశ్‌ దిక్కులు చూడాల్సిన అవసరం వచ్చింది.
రాజకీయ నిర్ణయంతో… 2014లో రాష్ట్రాన్ని విభజించాక ఆంధ్రప్రదేశ్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అనుభవం పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేసిన కుట్రలకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వంచనకు గురయ్యారు. అభివృద్ది పేరుతో అధికారంలో వచ్చిన టీడీపీ ఆపై అస్మదీయులకోసమే ఆలోచించింది. రాజధానికోసం ఏర్పాటైన అత్యున్నతమైన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది.

శాస్త్రీయమైన సలహాలను పక్కన పెట్టింది. అక్రమాలే పరమావధిగా… రాజధానిపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ఎక్కడ ఉండబోతుందన్న విషయంపై తన వారికి ముందుగానే సమచారమిచ్చిన టీడీపీ సర్కార్‌. టీడీపీ నేతలు అక్రమంగా భూములు కొనుగోలు చేశాక… ఆపై అమరావతి రాజదాని అంటూ ప్రకటనలు. బడుగు బలహీన వర్గాలకు కొత్త రాజధానిలో స్థానం లేకుండా కుట్రలు. నిబంధనలకు విరుద్ధంగా దళితులు భూములను ఆక్రమించుకున్న
చంద్రబాబు అనుచరులు. రాజధానిపై ఇతర వర్గాల సలహాలు.. సూచనలు తీసుకోని చంద్రబాబు సర్కార్‌… స్టేక్‌ హోల్డర్స్‌ను పక్కన పెట్టి రాజధానిపై స్వార్థపూరిత నిర్ణయాలు. అమరావతి పేరుతో ఓ హైప్‌ క్రియేట్‌ చేసి… అనువుగాని చోట రాజధానికోసం 33వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం. పచ్చటి పొలాలను బీళ్లుగా మార్చి మరీ… అక్రమాలకు తెరలేపిన చంద్రబాబు సర్కార్‌. ప్రశ్నించిన దళితులు, బలహీన వర్గాలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస పచ్చపార్టీనేతలు. భూములిస్తే అభివృద్ధి చేసి ఫ్లాట్‌లిస్తామని చెప్పిన సర్కార్ ఐదేళ్లలో ఫ్లాట్‌లు ఎక్కడున్నాయో కూడా చెప్పలేదు. తాత్కాళిక భవనాల పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీల్ల ప్రాయంలా ఖర్చు చేసిన అప్పటి సర్కార్. కేవలం అమరావతిలో అభివృద్ధి గ్రాఫిక్స్ చూపెడుతూ ఐదేళ్లూ కాలక్షేపం చేసిన పాలకులు. ఆంధ్రప్రదేశ్‌లో మరే ప్రాంతం గురించి పట్టించుకోని సర్కార్‌. రాయలసీమలో రైతులు కరువుతో అల్లాడుతుంటే… కనీసం పట్టించుకోని పాలకులు. రాయలసీమలో సాగునీటికోసం ఒక్కప్రాజెక్టును పూర్తిచేయని చంద్రబాబు.

ఉత్తరాంధ్రకోసం ఒక్క పథకము ప్లాన్‌ చేయలేదు. పారిశ్రామికంగా అభివృద్ధికాగల సముద్రతీరం నిర్లక్ష్యానికి నెట్టవేయబడింది. వ్యవసాయానికి నెలవుగా ఉన్న గోదావరి జిల్లాలు… పాలకుల కళ్లకు కనబడలేదు. రాష్ట్రం ఆర్ధికంగా తిరోగమనం పాలైంది. రాష్ట్రంలో విద్యా, వైద్యం ఒక్కటేంటి ఇలా అన్ని రంగాల్లో సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ది ఆనవాళ్లు లేకుండా పోయింది. కేవలం అమరావతిలో లక్షకోట్ల అభివృద్ధి అనేగ్రాఫిక్కులు మాత్రమే… తమ మీడియా ద్వారా ప్రజల కళ్లకు కట్టారు.

అమరావతి పేరతో చంద్రబాబు చేసిన అక్రమాలు ప్రజలు గ్రహించారు. అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం… ఎన్నికలే వేదికగా చంద్రబాబును మట్టికరిపించారు. చరిత్ర ఎన్నడూ చూడని విధంగా… వైఎస్సార్సీపీకీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉప్పెనలా వచ్చిన జగన్‌ ప్రభంజనానికి పార్టీలు… నాయకులు కొట్టుకుపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులతో సహా.. అన్ని ప్రాంతాల్లో జగన్ ప్రభంజనం కొనసాగింది. ముక్తకంఠంతో యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ జగన్మోహన్‌రెడ్డికి అండగా నిలబడింది. ఈ తీర్పు సామాన్యమైంది కాదు. పీడిత తాడిత జనం… అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. ప్రజలకు జరిగిన అన్యాయాలను చక్కదిద్దాలనే ఓ గురతరమైన బాధ్యతను ఈ తీర్పు కొత్తముఖ్యమంత్రి భుజాలపై పెట్టింది. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దాల్సిన బాద్యతను వైఎస్‌ జగన్‌ విస్మరించే అవకాశంలేదు. అన్యాయాలను సరిచేసే పనినుంచి జగన్‌ తప్పుకుంటే… చరిత్రలో ఆయన కూడా దోషిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు తప్పిదాలను, అక్రమాలను సరిదిద్దేందుకే వైఎస్‌జనగ్‌నుకు ప్రజలు ఈ స్థాయిలో పట్టం కట్టారు. అందుకే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికోసం జగన్ ఎన్నో ఆలోచనలు చేశారు. కమిటీలు, కమిషన్‌లు వేసి… ఏంచేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయో సునిశితంగా, సమగ్రంగా పరిశీలించారు. సున్నితమైన అంశమైనప్పటికీ… రాష్ట్ర సమగ్ర అభివృద్ధికోసం రాజకీయాలకతీతంగా కొత్త ప్రభుత్వం నిర్ణయాలకు ఉపక్రమించింది.

అన్యాయాన్ని సరిదిద్దేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం… ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రానికి రాజదానితో పాటు… అనని ప్రాంతాల్లో ప్రగతి ఫలాలను విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక ఆరునెలల పాటు పరిస్థితులను సమీక్షించి… సంతులిత అభివృద్ధి కోసం సాధన చేస్తోంది.

ఇలాంటి ప్రయత్నాలు సాగిస్తున్న జగన్ ప్రభుత్వంపై.. కుట్రదారులు తెగబడుతున్నారు. తాము చేయలేక పోయిన మంచిపనులు చేస్తున్న జగన్‌ను అడ్డుకునేందుకు… కుతంత్రాలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న వర్గాలు… ఇప్పుడు ఆందోళనల పేరుతో వీధిపోరాటాలకు దిగుతున్నాయి. చంద్రబాబు జోళెపట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. రాష్ట్రానికి సంజీవనిలాంటి ప్రత్యేక హోదాకోసం మాటకూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు అన్యాయం అంటూ రోడ్డెక్కుతున్నారు. అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు… ఢిల్లీ పెద్దల భయంతో దేహీ అంటూ సాష్టాంగ పడ్డారు. తన బినామీల భూముల ధరల కోసం… తన ఆస్తుల రక్షణ కోసమే బాబుగారు ఈ పోరాటం చేస్తున్నారనే వాస్తవం ఎరగని వారెవ్వరూ లేరు. చంద్రబాబు డబ్బాకొట్టే ఓ వర్గం దగుల్బాజీ మీడియా ఇప్పుడు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందనే హాహాకారాలు చేస్తోంది. నైతిక విలువలు మరిచి… కట్టుకథలు వండివారుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలను అక్రమాలంటూ ప్రచారం చేస్తోంది. ఇక చంద్రబాబు తానా అంటే తందానా అనే ప్యాకేజీ బాబులు ఇప్పుడు శాంతిభద్రతలు దెబ్బతీసే పనిలో పడ్డారు. డిల్లీ పర్యటనల పేరుతో హడావిడి చేస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికోసం నడుంకట్టిన జగన్‌కు రాష్ట్రం అండగా నిలబడింది. మేమంతా జగన్ వెంటే అనే మాట ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ దిశను మార్చేందుకు జగన్ చేపట్టిన ఈ మహాయజ్ఞంలో… ప్రతీ ఆంధ్రుడు ఓ అగ్ని కణికలా కదిలి వస్తున్నాడు. అందుకే జగన్ వెంట నిలిచిన ఈ ప్రజా సాగరంలో… ప్రతిపక్షాలు, ప్రత్యర్ధులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాలు కొట్టుకుపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *