సీక్రెట్గా డీల్ సెట్.. మెగా సర్ప్రైజ్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ!

చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ! సీక్రెట్‌గా డీల్ సెట్..

ఆచార్య’ తర్వాత చిరంజీవి నటించనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో విజయ్ దేవరకొండ భాగం కానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో డీల్ సెట్ చేసుకున్నారని టాక్.

మెగా సర్ప్రైజ్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ! సీక్రెట్గా డీల్ సెట్.. మెగా సర్ప్రైజ్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ! సీక్రెట్గా డీల్ సెట్..

ప్రస్తుతం ప్రేక్షకలోకం ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలను చూసేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు.

మరోవైపు సీనియర్, జూనియర్ హీరోల కలయికలో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు సైతం ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి చేయనున్న కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ నటించనున్నారనే సర్‌ప్రైజింగ్ న్యూస్ బయటకొచ్చింది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న చిరంజీవి.. ఇది పూర్తికాగానే మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు.

ఈ సినిమా సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘లూసిఫర్’ ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆయనకు నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు.

ఈ క్రమంలో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవిని హీరోగా చూపిస్తూ ఆయనకు నమ్మిన బంటు పాత్రను విజయ్ దేవరకొండతో చేయించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇందుకు సంబంధించిన డీల్ కూడా సీక్రెట్‌గానే సెట్ చేసుకున్నారని టాక్.

మొదట ఈ పాత్రను రామ్ చరణ్ చేయనున్నట్లు వార్తలు రాగా, ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే ఇప్పుడు అదే పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకున్నారని తెలుస్తుండటం టాలీవుడ్ ప్రేక్షకులను హుషారెత్తిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందనేది!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *